యాంకర్ ప్రదీప్‌పై పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..!?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో టాప్ యాంకర్లలో ఒకరైన యాంకర్ ప్రదీప్ మరోసారి వార్తల్లో నిలిచారు. అది కూడా పోలీస్ కేసు విషయంలో..!. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి నానా తంటాలు పడ్డ ఆయనపై తాజాగా ఓ యువ దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో రెండ్రోజులపాటు జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఆయన సినిమాలో హీరోగా ఎలా నటిస్తారు..? ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్శకుడు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఆ యువ దర్శకుడు మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని రాంపల్లికి చెందిన శ్రీరామోజు సునిశిత్.
ఫిర్యాదులో ఏముంది!?
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా నాకు తెలిసింది. ప్రదీప్ గతంలో ఒక అమ్మాయిని వేధించిన ఘటనలో రెండు రోజులు జైలుకు వెళ్లివచ్చారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రదీప్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ప్రదీప్‌తో పాటు సినీ దర్శకుడు ఇద్దరూ కూడా నిబంధనలను అతిక్రమించారు. ప్రస్తుతం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ ఆపాలని ఆదేశాలు జారీ చేయండి’ అని ఫిర్యాదులో సునిశిత్ రాసుకొచ్చారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. న్యాయ సలహా అనంతరం కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
ఇదేం లింక్!
కాగా.. యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే.. అమ్మాయి విషయంలో రెండ్రోజులు శిక్ష అనుభవించాడని సదరు ఫిర్యాదుదారుడు ఆరోపిస్తుండటంతో అసలేం జరిగింది..? ఎప్పుడు ఈ వ్యవహారం నడిచింది..? అనే విషయం తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని.. ఫిలించాంబర్‌కు పంపించారని మరోవైపు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై నిజానిజాలు తెలియాలంటే ప్రదీప్ లేదా ఆ యువ దర్శకుడు మీడియా ముందుకు వస్తే గానీ తెలిసేలా లేవ్.!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout