యంగ్ డైరెక్టర్ దుర్మరణం.. విషాదంలో శంకర్!

  • IndiaGlitz, [Saturday,May 16 2020]

సినిమా ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి భయం.. మరోవైపు ఇలా వరుస విషాదాలతో ఇండస్ట్రీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకోగా.. తాజాగా కోలీవుడ్ యువ దర్శకుడు అరుణ్ ప్రశాంత్ (వెంకట్ పక్కర్) దుర్మరణం చెందాడు. కోయంబత్తూరులోని మెట్టుపాళ్యం వద్ద బైక్‌పై వెళుతుండగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రశాంత్ అక్కడికక్కడే కన్నుమూశాడు. యంగ్ డైరెక్టర్ మరణంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా అరుణ్... స్టార్ డైరెక్టర్‌ శంకర్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసి వర్క్ నేర్చుకున్నాడు. అనంతరం సొంతంగా ‘4జీ’ అనే సినిమాను తెరకెక్కించాడు. అరుణ్ ఇక లేడన్న విషయం తెలుసుకున్న శంకర్ కన్నీరుమున్నీరయ్యారు.!. ఈ మధ్య శంకర్‌కు అన్ని వరుస విషాద ఘటనలే ఎదురవుతున్నాయ్.

సినిమా రిలీజ్ కాకుండానే..

అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్న ఆ యువ దర్శకుడు తన తొలి సినిమా థియేటర్లో చూసే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యే విషయం. కుర్ర హీరో జీవీ ప్రకాశ్ కుమార్, గాయత్రి సురేశ్‌లతో ‘4జీ’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా 2016లో షూటింగ్ మొదలుపెట్టగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూనే వచ్చింది. అయితే.. లాక్ డౌన్‌కు ముందే షూటింగ్ అయిపోయింది. సినిమా రిలీజ్‌కు రెడీగా ఉన్న సమయంలో ఇలాంటి విషాద ఘటన జరగడం ఇండస్ట్రీని.. కుటుంబీకులను.. గురువును తీవ్రంగా కలచివేస్తోంది. ఈ ఘటనపై స్పందించిన జీవీ ప్రకాష్.. అరుణ్ తనకు సోదరుడు, స్నేహితుడి లాంటి వ్యక్తని.. ఆయన లేకపోవడం జీర్ణించుకోలేని విషయమని తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ప్రశాంత్ మృతిపై పలువురు నటీనటులు, అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

More News

ఏపీలో త్వరలో తెరుచుకోనున్న ప్రధాన దేవాలయాలు

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నది. ఇప్పటి వరకూ 3.0 లాక్‌డౌన్లు పూర్తి కాగా రేపో ఎల్లుండో మరోసారి పొడిగింపు

థియేటర్లకు ఆదాయం పెరిగే ఐడియా ఇచ్చిన నాగ్ అశ్విన్!

సావిత్రి బయోపిక్ ‘మహానటి’ చిత్రంతో స్టార్ హోదా అందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో ఆయన పేరు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు

రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..

భారతదేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజి ప్రకటించిన కేంద్రం..

డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య

అన‌సూయ‌ను అభినందించిన పోలీసులు

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగామ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు నేడు(మే 15). ఈ సంద‌ర్భంగా అన‌సూయ కీస‌ర మండ‌లంలోని ప‌లువురు గ‌ర్భిణీల‌కు న్యూటిష‌న్ కిట్ల‌ను పంపిణీ చేశారు.