Sudheer Varma : టాలీవుడ్లో విషాదం.. యువనటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమను విషాదాలు వీడటం లేదు. గతేడాది వరుసపెట్టి దిగ్గజాలను కోల్పోయిన టాలీవుడ్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో వర్థమాన నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖలోని తన నివాసంలో సుధీర్ వర్మ బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ సినిమాలతో పాటు షూట్ అవుట్ ఎట్ ఆలేరు వెబ్ సిరీస్‌లో సుధీర్ వర్మ కీలకపాత్రలు పోషించారు. అతని ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. అయితే వ్యక్తిగత సమస్యల కారణంగా సుధీర్ వర్మ బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సుధీర్ వర్మ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అతని మిత్రులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అతనితో కలిసి కుందనపు బొమ్మలో నటించిన మరో నటుడు సుధాకర్ కోమాకుల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక్క సినిమాలో కలిసి నటించినా.. అతనితో గడిపిన క్షణాలు కలకాలం గుర్తుండిపోతాయని సుధాకర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం నింపిన తునీషా శర్మ ఆత్మహత్య:
ఇదిలావుండగా.. హిందీ నటి తునీషా శర్మ గత నెలలో ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. షూటింగ్ సెట్స్‌లోనే ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ కేసులో తునీష సహనటుడు షీజన్ మహ్మద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలీ బాబా దస్తాన్, భారత్ కా వీర్ పుత్ర్ మహారాణా ప్రతాప్, చక్రవర్తి అశోక్ సామ్రాట్, గబ్బర్ పూంచ్‌వాలా, షేర్ ఏ పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్, ఇంటర్నెట్ వాలా లవ్, ఇష్క్ శుభనాల్లా సీరియల్స్‌తో తునీషా శర్మ దేశ ప్రజలకు సుపరిచితురాలు. దీనితో పాటు ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2, దుర్గారాణి సింగ్, దబాంగ్ 3 వంటి సినిమాల్లోనూ ఆమె నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com