రూ.410 కోట్ల నెట్ వర్త్, 120 కోట్ల ఆదాయం.. థలపతి విజయ్ అంటే ఇది!
- IndiaGlitz, [Tuesday,June 22 2021]
సౌత్ లో అత్యథిక రెమ్యునరేషన్ అందుకునే నటుల్లో విజయ్ ఒకరు. తమిళనాట రజనీ తర్వాత అభిమానులకు ఆరాధ్య దైవంగా మారుతున్నాడు విజయ్. నేడు విజయ్ తన 47వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. విజయ్ బర్త్ డే సందర్భంగా కాస్త ముందుగానే సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. విజయ్ తదుపరి చిత్రం 'బీస్ట్' ఫస్ట్ లుక్ సోమవారమే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: మోసపోయిన సురేష్ బాబు.. వ్యాక్సిన్ అంటూ బురిడీ కొట్టించిన కేటుగాడు
విజయ్ సామాన్యంగా కనిపించే అసామాన్యుడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంటాయి. అందుకే విజయ్ తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు, నిర్మాత కోరుకుంటారు. విజయ్ సంపాదన గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
అందుతున్న సమాచారం ప్రకారం 2021లో విజయ్ నెట్ వర్త్ విలువ రూ 410 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. సినిమాలు, ఇతర ఆదయ మార్గాల ద్వారా విజయ్ వార్షిక ఆదాయం రూ 120 కోట్ల వరకు ఉంటుందట. రజనీకాంత్ దర్బార్ చిత్రానికి రూ 90 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారట. రజనీని మించేలా విజయ్ 'బీస్ట్' చిత్రం కోసం రూ 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక విజయ్ కి లగ్జరీ కార్లంటే కూడా మక్కువ ఎక్కువే. ప్రస్తుతం విజయ్ రూ 6 కోట్ల విలువైన రోల్స్ రాయల్స్ గోస్ట్, రూ 1.30 కోట్ల విలువైన ఆడి ఏ 8, 75 లక్షల విలువైన బీఎండబ్ల్యూ సిరీస్ 5, 90 లక్షల విలువైన బీఎండబ్ల్యూ ఎక్స్ 6, 35 లక్షల విలువైన మినీ కూపర్ కార్లని వినియోగిస్తున్నారు.
బీస్ట్ తర్వాత విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.