close
Choose your channels

నన్ను చంపగలవేమో.. రెచ్చగొడితే బాగోతం బయటపెడతా!

Sunday, March 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నన్ను చంపగలవేమో.. రెచ్చగొడితే బాగోతం బయటపెడతా!

సీనియర్ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు గత కొన్ని రోజులుగా తన కాలేజీకి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఏపీ సర్కార్‌తో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలేజీ విద్యార్థులతో కలిసి భారీగా ధర్నాకు దిగడం.. రంగంలోకి దిగిన పోలీసులు అడ్డుకోవడం.. ఆ తర్వాత మోహన్‌బాబు తెలుగు తమ్ముళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇవన్నీ చకాచకా జరిగిపోయాయి. అంతేకాదు మోహన్ బాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మీడియా మీట్ పెట్టి మరీ తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన మంచు.. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.

ముఖ్యంగా.. ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు కుటుంబరావు తనపై చేసిన విమర్శలకు ట్విట్టర్ వేదికగా మోహన్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే చంద్రబాబు పేరును ప్రస్తావించకుండానే తీవ్ర పదజాలంతో కలెక్షన్ కింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన కుటుంబంపై చంద్రబాబు కక్ష సాధింపు మొదలుపెట్టారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అడిగితే చెప్పే ధైర్యంలేక జోకర్ల చేత మాట్లాడిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఆయన గురించి చెప్పాలంటే గ్రంథం..!

"ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే తమపై కక్షసాధింపు మొదలుపెట్టాడు. ఆ గ్రేట్ అబద్ధాల కోరు గురించి చెప్పాలంటే ఒక గ్రంథం తయారవుతుంది. 2013లో అతడు అధికారంలో లేకపోయినా ఎంతో గౌరవించి నా ఫంక్షన్స్, సినిమా ఓపెనింగ్స్ ఎన్ని జరిగాయో అన్నింటిలోనూ ఉన్నాడు.. కావాలంటే ఇంటర్నెట్‌లో చూసుకోండి. అధికారంలో లేకపోయినా ఎంతో గౌరవించి ప్రతి కార్యక్రమానికీ ఆహ్వానించాను.. కానీ నామీద నా కుటుంబం మీద కక్షసాధింపు చర్య చేపట్టాడు. నేను అడిగింది మా విద్యా సంస్థల్లో చదువుతోన్న పిల్లలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బు మాత్రమే. అది అడిగితే అతడికి చెప్పే ధైర్యం లేక ఇద్దరు జోకర్ల దగ్గర చెప్పిస్తున్నాడు. ప్రభుత్వం నీదైనప్పుడు ఆటోమేటిక్‌గా కొన్ని వందల వేల మంది నీ మోచేతి నీళ్లు తాగే వాళ్లుంటారు. వాళ్లెవ్వరూ వద్దే ఓపెన్‌గా నువ్వే రా.. నీ స్టేటస్‌కి నేను గతనా, నిజానికి నా స్టేటస్‌కి నువ్వే అర్హుడు కాదు" అని చంద్రబాబుపై మోహన్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

నన్ను రెచ్చగొడితే చరిత్ర బయటపెడతా..?

"ప్రజలు ఇచ్చిన పదవిలో ఉన్నంత మాత్రాన గొప్పవాడిని అనుకుంటే ఎలా? తప్పు తప్పది.. పక్క రాష్ట్రాల్లో కూడా చూశావు. అన్న ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు పార్టీని ఏమి చేశావో అవననీ చెబితే బాగుండదు.. ఇక నన్ను రెచ్చగొడితే నీ చరిత్ర, అన్నయ్యకు జరిగిన ఘోరాలు, చేసిన మోసాలు అడగడుగునా అనుక్షణం బయటపెడతా. నువ్వు చెయ్యగలిగితే ఒక్కటే చేయగలవు. అది నన్ను చంపించడం అంతే. ఇంతకంటే ఏమీ చేయలేవు. నీకు ఆ రాజకీయాలు కూడా తెలుసని నాకు తెలుసు. నా జీవితం తెరచిన పుస్తకం, నీది అవినీతి చరిత్ర. చంద్రబాబు నేరుగా చర్చకు రా... ఎనీ టైం, ఎనీ ప్లేస్‌ నా స్థాయికి నీవు తగవు. నాకు వచ్చిన ప్రతి రూపాయికి లెక్కలున్నాయి. నువ్వు వసూలు చేసిన వేలకోట్లకు లెక్కలు చెప్పగలరా?" అంటూ తెలుగు తమ్ముళ్లు, చంద్రబాబుపై ఘాటు పదజాలంతో మంచు మోహన్ బాబు లేఖాస్త్రం సంధించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment