ఇంట్లోనే కూర్చొని మీకు కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చు: డాక్టర్ సంధ్య

  • IndiaGlitz, [Saturday,June 20 2020]

గత కొద్ది రోజులుగా మానవాళిని వణికిస్తున్న మహమ్మారి కరోనా. మొదట్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఈ మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కానీ ఇప్పుడు కరోనా ఉన్నవారూ.. లేనివారూ ఒకేలా కనిపిస్తున్నారు. ఎలాంటి లక్షణాలూ కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో మనం కరోనా టెస్టుల కోసం ఆసుపత్రుల వరకూ పరిగెత్తక్కర్లేదంటున్నారు డాక్టర్ సంధ్యా రామనాథన్. ఇంట్లో కూర్చొనే కరోనా ఉందో లేదో చెక్ చేసుకునే పద్ధతిని ఆమె ఓ వీడియో ద్వారా సూచించారు. దీనికి ఆమె పల్స్ ఆక్సిమీటర్ అనే పరికరాన్ని మనకు పరిచయం చేశారు.

మన శ్వాస ద్వారా కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చని సంధ్య పేర్కొన్నారు. పల్స్ ఆక్సిమీటర్ అనే చిన్న పరికరాన్ని ఆన్ చేసి దానిలో మన చూపుడు వేలు పెడితే.. మన రక్తంలో ఆక్సిజన్ లెవల్‌తో పాటు మన పల్స్ రేటును కూడా చెబుతుందని సంధ్య వెల్లడించారు. నార్మల్‌గా మన బ్లడ్‌లో ఆక్సీజన్ లెవల్ 95 - 100 ఉండాలని.. కానీ 93కంటే తక్కువకు పడిపోతే మనకు వైద్య సహాయం తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు. అయితే కరోనా రాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ఆమె వీడియోలో వివరించారు. ఇమ్యూనిటీ సిస్టమ్‌ను పెంచుకోవడం ఎలా? మన డైట్‌లో ముఖ్యంగా ఏమేమి ఉండేలా చూసుకోవాలి? అలాగే కొన్ని బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను కూడా సంధ్య సూచించారు.

More News

పవన్ 27.. రూ.కోటి నష్టం..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌చ్చారు.

ఈ విషయం తెలిస్తే మాస్క్ లేకుండా బైక్‌పై ఎట్టి పరిస్థితుల్లో తిరగరు!

కరోనా సమయంలో మాస్క్ తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా మాస్క్ లేకుండా బైక్‌పై కనిపిస్తే ఆపి ఫైన్ వేస్తోంది.

నేటి సాయంత్రం పదో తరగతి పరీక్షలపై స్పష్టతనిస్తాం: ఏపీ విద్యాశాఖామంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల్లో కొన్ని అనుమానాలున్నాయి.

'సీటీమార్' లో కబడ్డీ కోచులుగా గోపీచంద్, తమన్నా

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై  శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం `సీటీమార్‌`.

షాకిస్తున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. కాస్త ఊరటనిచ్చే అంశమిదే..

జనాభాలో ప్రపంచంలోనే రెండో పెద్ద దేశం మనది.