ర‌వితేజ ఎవ‌డో ఒక‌డు ప్రారంభం

  • IndiaGlitz, [Thursday,October 22 2015]

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఎవ‌డో ఒక‌డు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర‌ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ద‌స‌రా రోజున ఈ సినిమాను ప్రారంభించారు. హీరో ర‌వితేజ పై ముహుర్త‌పు స‌న్నివేశానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వినాయక్ క్లాప్ నివ్వ‌గా, హారీష్ శంక‌ర్ స్విచ్ఛాన్ చేసారు. సుకుమార్ తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...భ‌ద్ర త‌ర్వాత ర‌వితేజ‌తో మా బ్యాన‌ర్ లో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ర‌వితేజ బాడీ లాంగ్వేజ్ త‌గ్గ‌ట్టుగా ఉండే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా ఉంటుంది. ఆర్య సినిమా నుంచి మా సంస్థ‌లో ప‌నిచేసి ఓ మై ఫ్రెండ్ సినిమాతో ద‌ర్శ‌కుడైన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. న‌వంబ‌ర్ 25 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తాం. స‌మ్మ‌ర్ లో ఈ మూవీని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

ర‌వితేజ‌, ప్ర‌కాష్ రాజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, నాజ‌ర్, రావు ర‌మేష్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీప్ర‌సాద్, కెమెరా రిచ‌ర్డ్ ప్ర‌సాద్, డైలాగ్స్ ర‌మేష్ గోపి, ఎడిట‌ర్ కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ వంక‌, కో ప్రొడ్యూస‌ర్స్ శిరీష్ ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత దిల్ రాజు, క‌థ‌-స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం వేణు శ్రీరామ్