'RRR' లో మరో విప్లవ వీరుడు
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం `RRR`. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజులకు చెందిన ఓ ఊహాజనితమైన కథాశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 75 శాతం మేరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అంటే ఇద్దరు విప్లవ వీరులకు సంబంధించిన కథ ఇది. కాగా.. ఈ సినిమాలో మరో విప్లవ వీరుడు కూడా కనిపించబోతున్నాడట. ఆయనెవరో కాదు... ప్రజా గాయకుడు గద్దర్. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌కు సంబంధించిన ఓ పాటను పాడాలని రాజమౌళి కోరడంతో ఆయన సరేనన్నారట. గద్దరే స్వయంగా పాట రాసి పాడనున్నారని టాక్.
భారీ అంచనాలతో రూ.400 కోట్ల బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తోన్నది. కాబట్టి ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే పాన్ ఇండియా సినిమాగా దీన్ని మలుస్తున్నారు. అందుకోసం బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, అలియా భట్‌లతో పాటు.. హాలీవుడ్ తారలు ఓలివియా మోరిస్, అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 30న విడుదల చేస్తామని ఇది వరకే చిత్ర యూనిట్ ప్రకటించినా.. సినిమా విడుదల తేదీపై అనుమానాలు మాత్రం తొలగలేదు. ఇప్పటే సినిమా 75 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments