'RRR' లో మ‌రో విప్ల‌వ వీరుడు

  • IndiaGlitz, [Monday,January 06 2020]

ద‌ర్శ‌కధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం 'RRR'. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌, మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామ‌రాజుల‌కు చెందిన ఓ ఊహాజ‌నిత‌మైన క‌థాశంతో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. కొమురం భీమ్‌గా తార‌క్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా 75 శాతం మేర‌కు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. అంటే ఇద్ద‌రు విప్ల‌వ వీరుల‌కు సంబంధించిన క‌థ ఇది. కాగా.. ఈ సినిమాలో మ‌రో విప్ల‌వ వీరుడు కూడా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఆయ‌నెవ‌రో కాదు... ప్ర‌జా గాయకుడు గ‌ద్ద‌ర్‌. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌కు సంబంధించిన ఓ పాట‌ను పాడాల‌ని రాజ‌మౌళి కోర‌డంతో ఆయ‌న స‌రేనన్నార‌ట‌. గ‌ద్ద‌రే స్వ‌యంగా పాట రాసి పాడ‌నున్నార‌ని టాక్‌.

భారీ అంచ‌నాల‌తో రూ.400 కోట్ల బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తోన్న ఈ చిత్రం బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి చేస్తోన్న‌ది. కాబ‌ట్టి ఎలాంటి అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. అలాగే పాన్ ఇండియా సినిమాగా దీన్ని మ‌లుస్తున్నారు. అందుకోసం బాలీవుడ్ తార‌లు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్‌ల‌తో పాటు.. హాలీవుడ్ తార‌లు ఓలివియా మోరిస్‌, అలీస‌న్ డూడీ, రే స్టీవెన్ స‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ సినిమాను జూలై 30న విడుద‌ల చేస్తామ‌ని ఇది వ‌ర‌కే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించినా.. సినిమా విడుద‌ల తేదీపై అనుమానాలు మాత్రం తొల‌గ‌లేదు. ఇప్ప‌టే సినిమా 75 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

More News

జగన్ ఫ్యామిలీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేసులు!!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని నాటి నుంచి నేటి వరకూ కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.

ఆ స్టార్ డైరెక్ట‌ర్స్ క‌థ‌ల‌ను దొంగ‌లిస్తారట‌!!

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్స్‌గా పేరున్న వారిలో ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ఒక‌రు కాగా.. మ‌రొక‌రు అట్లీ. వీరిద్ద‌రిపై ఓ అప‌వాదు ఉంది.

విశాఖలో రాజధాని ఫిక్స్.. తరలనున్న శాఖలివే..!

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించే ప్రసక్తే లేదని ఎన్నికలకు ముందు చెప్పిన వైసీపీ నేతలు..

చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటానంటున్న అల్లు హీరో

సోష‌ల్ మీడియా ప‌రిధి పెరిగింది ప్ర‌మోష‌న్స్ ప‌రంగా సినిమాల‌కు బాగానే ప‌నికొస్తున్నాయి. అయితే దీనికి రివ‌ర్స్ కూడా జ‌రుగుతుంది.

అదీ బాల‌య్యంటే..!

నంద‌మూరి బాల‌కృష్ణ జ‌యాప‌జ‌యాలు గురించి ఆలోచించ‌ని హీరో. అలాగే మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే మ‌న‌స్త‌త్వం ఆయ‌న‌ది.