డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'ఎలుకా మజాకా'

  • IndiaGlitz, [Monday,July 20 2015]

74 చిత్రాల అద్భుత హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో నా ఫ్రెండ్స్‌ ఆర్ట్‌ మూవీస్‌' అధినేతలు మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన రేలంగి సంపూర్ణ హాస్యభరిత 75వ చిత్రం ఎలుకా మజాకా'. స్టార్‌ కమెడియన్‌ డా.బ్రహ్మానందం ఇందులో ప్రధాన భూమిక పోషించగా వెన్నెల కిశోర్‌, పావని హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం టాకీపార్ట్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం గ్రాఫిక్‌ వర్క్ ను జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు నరసింహారావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ రేలంగి నరసింహారావు గారు, దివాకరబాబు, గంగోత్రి విశ్వనాథ్‌ వంటి ముగ్గురు దిగ్గజాలు కలిసి మా ఎలుకా మజాకా' చిత్రాన్ని అద్భుతంగా తయారు చేశారు. ఇంత వరకు అందరూ హాయిగా నవ్వుకునే వినోదాత్మక చిత్రాలను రూపొందించిన రేలంగి గారు వాటికి భిన్నంగా గ్రాఫిక్స్ ను కూడా మిక్స్‌ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా డా.బ్రహ్మానందం గారు ఎలుకగా చేయటం, వారితో పాటు వెన్నెల కిషోర్‌, రఘుబాబు తదిదరులంతా మాకు ఎంతగానో సహకరించారని'' అన్నారు.

చిత్ర దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ఎలుకా మజాకా' చిత్రం షూటింగ్‌ మార్చితో పూర్తికాగా, డబ్బింగ్‌ కూడా పూర్తయింది. అంతేగాక ఇంటర్వెల్‌ వరకు గ్రాఫిక్‌ వర్క్‌ కూడా పూర్తయింది. ఈ నె 20 నుండి ఫైనల్‌ ఎడిటింగ్‌ ప్రారంభమవుతుంది. సీనియర్‌ రైటర్‌ దివాకరబాబుగారు ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే సమకూర్చడమేగాక నాతో పాటు గ్రాఫిక్‌ వర్క్ లో పాల్గొంటూ తన సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సత్య గ్రాఫిక్‌ వర్క్‌ , గంగోత్రి విశ్వనాథ్‌ మాటు హైలెట్‌గా నిలుస్తాయి. సోషల్‌ మీడియాలో ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన భిస్తోంది. అభిరుచిగల నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. మార్చి 15కల్లా తొలి కాపీ రెడీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

ఈ చిత్రానికి మూల కథ: మురళీమోహనరావు, స్క్రీన్‌ప్లే: దివాకర్‌బాబు, మాటలు: గంగోత్రి విశ్వనాథ్‌, పాటలు: గంగోత్రి విశ్వనాథ్‌, తైదల బాపు, కెమెరా: నాగేంద్ర కుమార్‌, సంగీతం: బల్లేపల్లి మోహన్‌, గ్రాఫిక్స్‌: సగిలి సత్యనారాయణ రెడ్డి, కో- డైరక్టర్‌: రమణబాబు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ధవళ చిన్నారావు, నిర్మాతలు: మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు. కథ- దర్శకత్వం: రేలంగి నరసింహారావు.

More News

సెప్టెంబర్ 17న వినాయకచవితికి రామ్ 'శివమ్' రెడీ

'పండగ చేస్కో' వంటి ఘనవిజయం తర్వాత రామ్ తెరపై కనిపించబోతున్న చిత్రం 'శివమ్'.

షూటింగ్ పూర్తి చేసుకున్న 'సతీ తిమ్మమాంబ'

ఎస్.ఎస్.ఎస్. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భవ్యశ్రీ ప్రదాన పాత్రలో రూపొందుతున్న హిస్టారికల్ మూవీ ‘సతీ తిమ్మమాంబ’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

నారా రోహిత్ నిర్మాతగా మరో చిత్రం

బాణం, సోలో, ప్రతినిధి, రౌడీఫెలో, అసుర వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో నారారోహిత్ అసుర చిత్రాన్ని అరన్ మీడియా బ్యానర్ పై ప్రెజెంట్ చేసి నిర్మాతల్లో ఒకడిగా వ్యవహరించాడు.

జూలై 31న విడుదలవుతున్న 'మిర్చిలాంటి కుర్రాడు'

నటసింహ నందమూరి బాలకృష్ణతో ‘లయన్’ వంటి హిట్ మూవీని నిర్మించిన నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మాతగా అభిజిత్, ప్రగ్యాజైశ్వాల్ హీరో హీరోయిన్లుగా రుద్రపాటి ప్రేమలత సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమా బ్యానర్పై రూపొందిన చిత్రం ‘మిర్చిలాంటి కుర్రాడు’

90 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న 'కొలంబస్'

సుమంత్ ఆశ్విన్ హీరోగా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఆర్.సామల దర్శకత్వంలో ఆశ్వీనీకుమార్ సహదేవ్ నిర్మిస్తోన్న చిత్రం ‘కొలంబస్’.