ఎల్లో శారీ లేడీ ఆఫీసర్ అడ్రస్ దొరికిందోచ్..!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదిగో.. ఈ పచ్చ చీరలో ఉండే కనిపించే ఆంటీని చూస్తే మీకేం అనిపిస్తోంది..? ఇదేదో సినిమా సీన్లాగానో..? ఆమెను సినిమాలో హీరోయిన్‌గానో అనుకుంటున్నారు కదూ..! నిజమే చాలా వరకు ఇది సినామాలోని ఓ సీన్ అనుకున్నారు.. అసలు విషయం తెలిశాక అందరూ కంగుతిన్నారు. ఇంతకీ పసుపు చీరలో కనిపించిన ఆంటీ ఎవరు..? ఈ ఫొటోలు ఎందుకింత వైరల్ అయ్యాయి..? అనే వాస్తవిక విషయాలు ఇప్పుడు తెలుసకుందాం.
ఇంతకీ ఆమె ఎవరు..?
ఈ పసుపు చీరలో కనిపించే మహిళ అందరూ అనుకుంటున్నట్లుగా ఏ సినిమాకు చెందిన వ్యక్తి కాదు.. సినిమా హీరోయిన్ అంతకన్నా కాదు.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఓ మహిళా అధికారి అంతే. ఈ మహిళా అధికారి అసలు పేరు రీనా ద్వివేది. ఈమె లక్నోలో ఓ బూత్‌కు అధికారిగా వెళ్లారు. ఎన్నికలకు ముందు రోజు ఇలా పోలింగ్ సామాగ్రి చేతపట్టుకుని లక్నోకు బయల్దేరుతుండగా కెమెరామెన్లు తమ కెమెరాలకు పనిచెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయిపోయారు. ఈమె ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతుండటంతో అసలు ఎవరు ఈమె అని తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్ బాట పట్టారు. సుమారు వారం రోజుల పాటు ‘హూ ఈజ్ ఎల్లో శారీ లేడీ ఆఫీసర్’ అనే ఎక్కువ మంది నెట్టింట్లో సోదించారు. ఆఖరికి ఆమె అడ్రస్‌ను కనిపెట్టేశారు కొందరు నెటిజన్లు. రీనా ద్వివేది లక్నోలో పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
ఒక్క బూత్‌కే కాదు అన్ని బూత్‌లకు ఇలాంటోళ్లు కావాలి!
కాగా.. నెట్టింట్లో ఈ ఫొటోలు వైరల్ అవుతుండటంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. వామ్మో.. ఈ లేడీ వెళ్లే బూత్‌లో వందశాతం పోలింగ్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈమె అందాన్ని చూసేందుకు ఓటర్లందరూ క్యూ కడతారంటూ కామెంట్లు చేశారు. అంతేకాదు.. ఒక్క పోలింగ్ బూత్‌లోనే కాదు.. అన్ని పోలింగ్ బూత్‌లల్లో ఇలాంటి అధికారులనే ఏర్పాటు చేయండి.. అని ఎన్నికల కమిషన్‌కు కొందరు రెక్వెస్ట్ కూడా పెట్టేశారు. మరికొందరు ఈ ఫొటోలు చూసి జోకులు కూడా పేలుస్తున్నారు. ఈ ఫొటోలు లక్షలాది మంది లైక్ చేయగా అంతకు రెట్టింపు మంది షేర్ చేశారంటే రీనా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో.. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా రీనాను సెలబ్రిటీ చేసేసిందన్న మాట.
సెల్ఫీలు కోసం క్యూ కడుతున్నారు!
కాగా ఈ మొత్తం వ్యవహారంపై రీనా ద్వివేది మీడియాతో మాట్లాడారు. మే 5న లక్నోలోని బూత్ నెంబర్ 173లో పోలింగ్ ఏర్పాట్ల పరిశీలన కోసం వెళ్లినప్పుడు ఈ ఫొటో తీశారన్నారు. అప్పట్నుంచి తాను బయటికెళ్తే చాలు జనాలు సెల్ఫీల కోసం క్యూ కడుతున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు తన ఫొటోలు ఇలా వైరల్ కావడం వల్ల కొంచెం పాజిటీవ్.. కొంచెం నెగటీవ్ కూడా ఉందని రీనా చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆమె ఫొటోలకు వచ్చిన కామెంట్స్‌పై స్పందిస్తూ తాను పనిచేసిన పోలింగ్ బూత్‌లో వంద శాతం కాదు 70 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయని చెప్పుకొచ్చారు. రీనా వెళ్లిన బూత్‌లో కచ్చితంగా వందశాతం పోలింగ్ నమోదై ఉంటుందన్న కామెంట్స్‌కు ఆమె పై విధంగా స్పందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments