ప్రభుత్వంపై పచ్చమీడియా రాతలు.. నవ్విపోదురుగాక ప్రజలు..
Send us your feedback to audioarticles@vaarta.com
పచ్చమీడియా ఎప్పుడూ చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రాస్తూనే ఉంటుంది. పచ్చ నేతలు మాట్లాడటం ఆలస్యం వాటిని తక్షణమే పచ్చ పత్రికల్లో కొద్దిగా మసాలా కారం జత చేసి రాసేస్తారు. ఏది పడితే అది రాసిస్తే జనం నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రస్తుతం ఈనాడు రాస్తున్న పచ్చరాతలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ పక్కా ప్రణాళిక ప్రకారం వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఐఏఎస్ అధికారులు ఎక్కువ మంది సీఎం జగన్ సొంత సామాజికివర్గానికి చెందిన వారేనని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడటం.. వెంటనే ఆ మాటలను తాటికాయం అక్షరాలతో ఈనాడు రాయడం జరిగిపోయాయి.
బాబు వర్గం నేతల అంశం ఎందుకు గుర్తు రాదు..
ఇదే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం ఈనాడు చేస్తోంది. చేసిన అభివృద్ది పచ్చమీడియాకు కనిపించదు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వైపు వారు కన్నెత్తి చూడరు. టీడీపీ హయాంలో జరిగిన అన్యాయాల గురించి ఆ మీడియా మాట్లాడదు. గురువిందగింజ సామెతలా ఈనాడు వ్యవహరిస్తుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు సామాజిక వర్గానికి చెందిన అధికారులు గురించి ఈనాడుకు ఎందుకు గుర్తుకు రాదు. కేంద్రం నుండి బాబు హయాంలో ఐఏఎస్ అధికారులు జాస్తి కృష్ణ కిషోర్, సంధ్యారాణి, రాజమౌళి,వెంకయ్య చౌదరి, సాంబశివరావు ఇలా ఎంతో మంది ఏపీకి వచ్చారు. వీరితో పాటు బాబుకు అనుకూలంగా వ్యవహరించే ఎంతోమంది ఐఏఎస్ అధికారులను రాష్ట్రానికి తీసుకువచ్చారు.
వైసీపీ ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నాలు..
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా ఎంతోమంది అధికారులను బాబుకు అనుకూలంగా ఉన్న వారిని తమకు నచ్చిన చోట పోస్టింగ్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. లేనిది ఉన్నట్లుగా చూపించే పచ్చదండు గురువు రామోజీరావు నేతృత్వంలో టన్నుల కొద్ది విషం చిమ్మి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది ఈనాడు పత్రిక. ఏపీలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు చూసి ఓర్వలేని యల్లోమీడియా టీడీపీ ఓటమి భయంతో అడ్డగోలు రాతలు, పచ్చి అబద్దాలు రంగరించి వండి వార్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. జర్నలిజం విలువలకు తిలోధకాలొదిలి తప్పుడు కథనాలు అచ్చేసే ఈనాడు విశ్వసనీయత ఎప్పుడో గంగపాలైపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments