పేరు మార్చుకుని సీఎంగా ‘యడియూరప్ప’ ప్రమాణం
Send us your feedback to audioarticles@vaarta.com
కర్ణాటక కొత్త సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం చేశారు. కాగా మొదట శుక్రవారం నాడు ఇదివరకున్న యడ్యూరప్ప అనే పేరును ‘యడియూరప్ప’గా మార్చుకుని సీఎం పీఠమెక్కారు. రాజ్ భవన్‌లో గవర్నర్ వాజ్ భాయ్ వాలా.. యడియూరప్పతో సీఎంగా ప్రమాణం చేయించారు. కాగా.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం యడియూరప్ప పుష్పగుచ్ఛం ఇచ్చిన గవర్నర్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. వందలాది మంది అభిమానులు, నేతలు, కార్యకర్తల మధ్య ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం జరిగింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సీఎంగా యడ్యూరప్ప మాత్రమే ప్రమాణ స్వీకారం చేయగా.. ఆయనతో పాటు మరెవరూ మంత్రులుగా ప్రమాణం చేయలేదు. సభలో బలనిరూపణ అనంతరం మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గం కూర్పులో ఎవరెవర్ని సెలెక్ట్ చేసుకుంటారో.. ఎవరెవర్ని పక్కనపెడతారో వెయిట్ చేయాల్సిందే.
సీఎం ట్రాక్ రికార్డ్ ఇదీ...
కాగా.. ప్రస్తుతం నాలుగోసారి కన్నడనాట సీఎంగా ‘యడియూరప్ప’ ప్రమాణం చేశారు. 2007 నవంబర్‌లో తొలిసారిగా సీఎంగా ఆయన ప్రమాణం చేశారు. అప్పట్లో జేడీఎస్ వల్ల నాలుగు రోజులకే సీఎం పదవి నుంచి వైదొలిగారు. 2008 మే 30న రెండోసారి సీఎంగా యడియూరప్ప ప్రమాణం చేశారు. అయితే మూడేళ్ల 2నెలల పాటు మాత్రమే ఈయన యడ్డీ పనిచేశారు. అవినీతి ఆరోపణలపై 2011లో రాజీనామా చేయాల్సి వచ్చింది. 2012లో బీజేపీకి రాజీనామా చేసిన ఆయన.. ‘కర్ణాటక జనతా పక్ష’ పేరుతో యడియూరప్ప కొత్తపార్టీ స్థాపించి కేవలం రెండేళ్లకే 2014లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అనంతరం 2014లో లోక్‌సభ ఎన్నికల్లో షిమోగా నుంచి యడియూరప్ప గెలుపొందారు. 2018 మే 17న మూడోసారి సీఎం ఆయన ప్రమాణం చేసి.. మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో పట్టుమని పీఠమెక్కిన మూడ్రోజులు కూడా సీఎం పదవిలో ఉండలేకపోయారు.
ఈ సారైనా ఫుల్‌టైమ్ సాగేనా!!
కాగా.. విశ్వాస పరీక్ష సందర్బంగా బలం నిరూపించుకోలేకపోయిన కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో 105 మంది సభ్యులతో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ బలనిరూపణకు కన్నడనాట హైడ్రామా నెలకొని చివరికి మంగళవారం సాయంత్రం ఈ ఎపిసోడ్‌కు తెరపడిన విషయం తెలిసిందే. అయితే.. యడియూరప్ప ఈసారైనా ఫుల్ టైమ్ సీఎంగా పనిచేస్తారా..? లేకుంటే మళ్లీ సీన్ రివర్స్ అవుతుందా..? అనేది మున్ముంధు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout