ఆ డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టాలి.. వైసీపీ మహిళా నేత
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ ‘కరుత్తుగలై పదివుసెయ్’ సినిమా ఆడియో వేడుకలో ఆడవారిపై నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం విదితమే. అత్యాచారాలు జరగటానికి కారణం ఆడవారేనని.. మహిళలు పద్దతీ పాడు లేకుండా ఉంటున్నారనీ కట్టుబాట్లను గాలికి వదిలేశారంటూ దారుణంగా మాట్లాడాడు. ఆడవాళ్లపై వేధింపులు జరిగినా.. అత్యాచారాలు జరిగినా దానికి కారణం వారేననీ.. వారి అజాగ్రత్త వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. అయితే భాగ్యరాజ్ వ్యాఖ్యలపై మహిళలు, మహిళా సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
చెప్పుతో కొట్టాలి.. !
అత్యాచార ఘటనలపై దారుణ వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ భాగ్యరాజ్‌ను చెప్పుతో కొట్టాలని ఆమె వ్యాఖ్యానించారు. భాగ్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో మహిళలపై దాడులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. ‘ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపించే సినీ రంగానికి చెందిన భాగ్యరాజ్ బాధ్యతారహితంగా మాట్లాడారు. మహిళలకు ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలి. భాగ్యరాజ్‌పై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇదే విషయంపై నేను తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాస్తాను’ అని వాసిరెడ్డి పద్మ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే భాగ్యరాజ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఇంతవరకూ తమిళనాట మహిళలు కానీ.. మహిళా సంఘాలు కానీ రియాక్ట్ కాకపోవడం గమనార్హం. రియాక్ట్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com