ఏపీలో విజయం వైసీపీదే.. టీడీపీ అంతర్గత సమావేశం వీడియో లీక్..

  • IndiaGlitz, [Saturday,April 20 2024]

ఏపీలో ఎక్కడా చూసిన వైసీపీ ప్రభంజనమే కనిపిస్తోంది. సీఎం జగన్ సభలకు జనం తాండోపతండాలుగా పోటెత్తుతున్నారు. ఇప్పటికే జాతీయ మీడియా సంస్థలతో పాటు మరికొన్ని సంస్థలు చేసిన సర్వేల్లోనూ వైసీపీ విజయం ఖాయమని స్పష్టమవుతోంది. అయితే ఈ సర్వేలే కాదు ఏకంగా ప్రతిపక్ష టీడీపీనే 147 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని తేల్చి చెప్పడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో పోలింగ్‌కు ముందే టీడీపీ తన ఓటమిని ఒప్పుకున్నట్లైంది. దీంతో వైసీపీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో స్వయంగా ఆ పార్టీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేశ్ వైసీపీ గెలుస్తుందని చెప్పిన వీడియో లీక్ అయింది. ఇందులో రాష్ట్రంలోని 147 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ సుమారు రెండు శాతం ఓట్ల తేడాతో ముందంజలో ఉందని టీడీపీ నేతలకు వివరించడం విశేషం. ముఖ్యంగా 28 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమిపై సుమారు పది లక్షల ఓట్ల తేడాతో వైసీపీ విజయపథంలో కొనసాగే అవకశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

వాస్తవానికి ఎన్నికల కోడ్ ముందు నుంచే రాష్ట్రంలో వైసీపీ దూసుకుపోతోంది. సీట్లు ప్రకటన దగ్గర నుండి కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. అలాగే సామాజిక బస్ యాత్ర, వై ఎపీ నీడ్స్ జగన్, ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమాలు నిర్వహించి నిత్యం ప్రజలతో మమేకమైంది. రాష్ట్రంలో నాలుగు చోట్ల నిర్వహించిన 'సిద్ధం' సభలతో ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది. కులం, మతం, పార్టీ, ప్రాంతాలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించడంతో సీఎం జగన్ జనహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. దీంతో వైసీపీ గెలుపు ఖాయమని తేలిపోయింది.

దీనికి తోడు చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుండి అంతంతమాత్రంగా స్పందన రావడంతో టీడీపీ క్యాడర్‌లో నిరుత్సాహం మొదలైంది. మరోవైపు టీడీపీ-బీజేపీ-జనసేన మద్య పొత్తు పొసగలేదు. సీట్లు సర్ధుబాట్లలో చిచ్చు చెలరేగింది. క్షేత్ర స్థాయిలో క్యాడర్‌లో సమన్వయం కొరవడింది. దీనికి తోడు ప్రముఖ సంస్థ సర్వేల్లో కూడా వైసీపీకి వస్తాయని తేలడంతో టీడీపీ ఆశలు అవిరైపోయాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఇంటర్నల్ సమావేశంలో వైసీపీ గెలుపును తేల్చుతూ బయటకు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో టీడీపీ క్యాడర్‌లో ఉన్న కొద్దో గొప్పో ఆశ కూడా చచ్చిపోయింది. మరోసారి ఓటమి ఖాయమని లబోదిబోమంటున్నారు.

More News

Pemmasani:పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ నిర్వీర్యం చేశారు: పెమ్మసాని

పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ నిర్వీర్యం చేశారని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు.

Modi:చంద్రబాబుకు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Bhaje Vayu Vegam:కార్తికేయ 'భజే వాయు వేగం’ టీజర్ విడుదల చేసిన మెగాస్టార్

టాలీవుడ్ యువహీరో కార్తికేయ తాజాగా నటిస్తు్న్న చిత్రం 'భజే వాయు వేగం’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం

Chandrababu, Balakrishna Assets: చంద్రబాబు, బాలకృష్ణ ఆస్తులు ఎంతో తెలుసా..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి తొలిసారి కుప్పంలో నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

YS Sharmila:కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వైఎస్ షర్మిల

కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు.