రఘురామ విషయంలో వైసీపీ కీలక నిర్ణయం.. రేపు ఢిల్లీకి ఎంపీలు
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా ఇటీవల ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అనంతరం వైసీపీ తరుఫున ఎంపీ విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు పంపించడం.. దానికి ప్రశ్నలనే రఘురామ కృష్ణరాజు సమాధానంగా పంపించడం శరవేగంగా జరిగిపోయాయి. అనంతరం రఘురామ కృష్ణరాజు మరో అడుగు ముందుకేసి.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.
అనంతరం వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు లేఖ కూడా రాశారు. అయితే ఆ లేఖపై జగన్ మాత్రం ఏమీ స్పందించలేదు. కాగా... వైసీపీ తరుఫున ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు వైసీపీ ఎంపీలు.. న్యాయ నిపుణులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరనున్నారు. మరి దీనిపై స్పీకర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout