టీడీపీ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను బయటపెట్టిన వైసీపీ
Send us your feedback to audioarticles@vaarta.com
నవ్యాంధ్ర రాజధాని ఏర్పడే ప్రాంతం సమాచారాన్ని ముందుగానే చంద్రబాబు తన సహచరులకు అందించి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ ఎప్పట్నుంచో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సీఎం హోదాలో ఉంటూ ప్రభుత్వ రహస్యాలను చెప్పనని ప్రమాణం చేసి.. బాధ్యత గల ముఖ్యమంత్రి తప్పుగా వ్యవహరించారని వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. అయితే.. ఇది శిక్ష్యార్హమైనది..చంద్రబాబు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ‘రాజధాని ఇక్కడి నుంచి తరలిపోవడం లేదు. రాజధానిని మూడు ప్రాంతాలకు డివైడ్ చేస్తున్నారు. అందరిని చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. హైకోర్టు కర్నూలులో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది. బినామీ రైతులకు మేం న్యాయం చేయలేకపోవచ్చు. నిజమైన రైతులకు న్యాయం చేస్తాం. అన్ని ప్రాంతాలను సంతృప్తి పరిచేందుకు జీఎన్ రావు కమిటీ నివేదికలు పరిశీలిస్తున్నాం. హైపవర్ కమిటీ నివేదికలు రావాలి’ అని వైసీపీ నేతలు చెబుతున్నారు.
చంద్రబాబు, ఆయన బినామీలు కొనుగోలు చేసిన భూములు.. :-
జూన్ 2014లో 530.69 ఎకరాలు
జులైలో 685.34 ఎకరాలు
ఆగస్టులో 353.03 ఎకరాలు
సెప్టెంబర్‌లో 567.26 ఎకరాలు
అక్టోబర్‌లో 564.91 ఎకరాలు
నవంబర్‌లో 836.81 ఎకరాలు
డిసెంబర్‌లో 531.90 ఎకరాలు
మొత్తంగా 4069.95 ఎకరాలు
రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు:-
హెరిటేజ్(చంద్రబాబు సొంత సంస్థ) కంతేరులో 14.22 ఎకరాలు
అప్పటి మంత్రి పొంగూరు నారాయణ-55.27 ఎకరాలు
అప్పటి మంత్రి పత్తిపాటి పుల్లారావు-38.84 ఎకరాలు
అప్పటి మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి -7.56 ఎకరాలు
అప్పటి మంత్రి రావెల కిశోర్‌బాబు-40.85 ఎకరాలు
టీడీపీ అప్పటి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఐనవోలు వద్ద 15.30 ఎకరాలు
అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు-53.48 ఎకరాలు
కొమ్మాలపాటి శ్రీధర్- 68.60 ఎకరాలు
కోడెల శివరామకృష్ణ- 17.13 ఎకరాలు
ధూలిపాళ్ల నరేంద్ర చౌదరి- 13.50 ఎకరాలు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout