అలీకి హ్యాండిచ్చిన జగన్.. వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వీరే, అనూహ్యంగా తెరపైకి ఆర్.కృష్ణయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో ఖాళీకానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్ధులను ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్. సుదీర్ఘ కసరత్తు అనంతరం లిస్ట్ ఫైనల్ చేశారు ముఖ్యమంత్రి. అభ్యర్ధుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ప్రకటించారు.
వైసీపీ అభ్యర్ధులు వీరే:
విజయసాయిరెడ్డి (వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి)
ఆర్ కృష్ణయ్య (బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు)
నిరంజన్ రెడ్డి (న్యాయవాది)
బీద మస్తాన్ రావు (వైసీపీ నేత)
రాజ్యసభ ఖచ్చితంగా వస్తుందని భావించిన సినీనటుడు అలీకి జగన్ నిరాశను మిగిల్చారు. కాకపోతే ఆయనకు నామినేటెడ్ పదవిని కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి సైతం సీఎం ఛాన్స్ ఇవ్వలేదు. ఎవ్వరూ ఊహించని విధంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అనూహ్యంగా రాజ్యసభ రేసులో నిలిచారు. అలాగే అదానీ కుటుంబం పేరు కూడా ఎక్కడా వినిపించలేదు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. జగన్ బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించారని ప్రశంసించారు. బీసీల పోరాటం అనేది తెలంగాణకు సంబంధించినది కాదని.. దేశవ్యాప్తంగా బీసీల కోసం పోరాడుతున్నానని కృష్ణయ్య తెలిపారు. ఈ పోరాటాన్ని గుర్తించి జగన్ తనకు రాజ్యసభ అవకాశం కల్పించారని కృష్ణయ్య వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments