close
Choose your channels

బాలయ్య పవర్‌ఫుల్ కాదు.. అంత సీన్లేదు.. !?

Sunday, February 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలయ్య పవర్‌ఫుల్ కాదు.. అంత సీన్లేదు.. !?

టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇటీవల సొంత నియోజకవర్గంలో చుక్కెదురైన సంగతి తెలిసిందే. పర్యటనకు వెళ్లిన బాలయ్యను వైసీపీ కార్యకర్తలు, నేతలు అడ్డుకోగా.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘నేను చిన్న సైగ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ రియాక్ట్ అవుతూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

అంత సీన్లేదు..!
‘బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బాలకృష్ణ మళ్లీ నటిస్తున్నారు.. అందుకే ఆ సినిమాలో డైలాగ్స్‌ను చెప్పుంటాడు. అంతకుమించి బాలయ్యకు అంత సీన్ లేదు. బాలయ్యేం అంత పవర్ ఫుల్ మ్యాన్ కాదు. బాలకృష్ణ మాటలను ఎవరు పట్టించుకుంటారు..?. అసలు ఆయన మాటలకు విలువ ఎక్కడుంది..?. ఒకవేళ బాలకృష్ణ అంత పవర్ ఫుల్ మ్యాన్ కనుక అయితే.. నాడు తండ్రి ఎన్టీఆర్‌ని మోసం చేసిన బావ చంద్రబాబు నుంచి ఒక్క మంత్రి సీటు సంపాదించలేకపోయాడు’ అని సురేష్ విమర్శలు గుప్పించారు.

అసలేం జరిగింది!?
కాగా.. ఆదివారం నాడు సురేశ్.. విజయవాడలో పర్యటించేందుకు వెళ్లిన ఆయన్ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కారును అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు ముందుకు వెళ్లనివ్వకుండా హడావుడి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పై విధంగా బాలయ్యపై వ్యాఖ్యలు చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment