బాలయ్య పవర్‌ఫుల్ కాదు.. అంత సీన్లేదు.. !?

  • IndiaGlitz, [Sunday,February 02 2020]

టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇటీవల సొంత నియోజకవర్గంలో చుక్కెదురైన సంగతి తెలిసిందే. పర్యటనకు వెళ్లిన బాలయ్యను వైసీపీ కార్యకర్తలు, నేతలు అడ్డుకోగా.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘నేను చిన్న సైగ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ రియాక్ట్ అవుతూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

అంత సీన్లేదు..!
‘బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బాలకృష్ణ మళ్లీ నటిస్తున్నారు.. అందుకే ఆ సినిమాలో డైలాగ్స్‌ను చెప్పుంటాడు. అంతకుమించి బాలయ్యకు అంత సీన్ లేదు. బాలయ్యేం అంత పవర్ ఫుల్ మ్యాన్ కాదు. బాలకృష్ణ మాటలను ఎవరు పట్టించుకుంటారు..?. అసలు ఆయన మాటలకు విలువ ఎక్కడుంది..?. ఒకవేళ బాలకృష్ణ అంత పవర్ ఫుల్ మ్యాన్ కనుక అయితే.. నాడు తండ్రి ఎన్టీఆర్‌ని మోసం చేసిన బావ చంద్రబాబు నుంచి ఒక్క మంత్రి సీటు సంపాదించలేకపోయాడు’ అని సురేష్ విమర్శలు గుప్పించారు.

అసలేం జరిగింది!?
కాగా.. ఆదివారం నాడు సురేశ్.. విజయవాడలో పర్యటించేందుకు వెళ్లిన ఆయన్ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కారును అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు ముందుకు వెళ్లనివ్వకుండా హడావుడి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పై విధంగా బాలయ్యపై వ్యాఖ్యలు చేశారు.

More News

‘దిశ’ నిందితుడి భార్యతో ఆర్జీవీ భేటీ.. కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఎమోషనల్ స్క్రిప్టును ఎంచుకున్నానని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

'22' టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుంది - కింగ్ నాగార్జున

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో

కురుమలై లో విక్టరీ వెంకటేష్ 'నారప్ప' యాక్షన్ సీక్వెన్సెస్

'ఎఫ్‌2', 'వెంకీమామ' వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం 'నారప్ప' షూటింగ్‌ అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది.

ఫిబ్ర‌వ‌రి 7న ‘జాను’ని చూసిన తెలుగు ప్రేక్ష‌కులు వావ్.. అంటారు - దిల్‌రాజు

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై

ఫిబ్రవరి-02కు ఉన్న ప్రత్యేకత తెలుసా!?

నేడు ఫిబ్రవరి-02. అంటే.. 02.02 అన్నమాట. ఏడాదితో కలిపితే.. 02.02.2020. ఒక్కసారి క్లారిటీగా చదివండి మ్యాజిక్ ఏంటో తెలుస్తుంది.