వైఎస్ జగన్‌ 'ట్రెండ్‌ సెట్టర్‌'గా మిగిలిపోతారు!

  • IndiaGlitz, [Friday,July 26 2019]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్రెండ్‌ సెట్టర్‌గా చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర బాగు కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు అసెంబ్లీలో లోకాయుక్త సవరణ బిల్లుపై కాపు రామచంద్రారెడ్డి మాట్లాడారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా అవినీతే కనిపించిందని.. అవినీతి నిరోధించడానికి సీఎం జగన్‌ లోకాయుక్త యాక్ట్‌ ప్రవేశపెట్టారని జగన్ తెలిపారు. ఇలాంటి పనులు చేసిన సీఎం జగన్‌ ట్రెండ్‌ సెట్టర్‌గా మిగిలిపోతారని ఆయన చెప్పారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా..!!

ముఖ్యమంత్రి జగన్‌ అభివృద్ధి, సంక్షేమం గురించి రకరకాల బిల్లులు తీసుకువచ్చారు. అవినీతిని నిర్మూలించేందుకు రెండు బిల్లులు తీసుకువస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త సవరణ బిల్లు, జ్యుడిషియల్‌ రివ్యూ బిల్లులు తీసుకొచ్చారు. ఏదైనా పని చేయాలంటే దానికి మనస్సు ఉండాలని.. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్‌ కమిషనర్స్‌ను అపాయింట్‌ కూడా చేయలేదు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిటీ కూడా లాగి లాగి చేయనేలేదు. చివరకు మైనార్టీని మంత్రిగా కూడా చేయలేదు. కానీ, సీఎం జగన్‌ ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి ప్రజల కోసం అనేక పథకాలు చేపడుతున్నారు అని కాపు చెప్పుకొచ్చారు.

జగన్‌ ట్రెండ్‌ సెట్టర్‌!!

భారతదేశంలో 771 జడ్జిలు, 308 అదనపు జడ్జిలు అవసరం ఉంది. కానీ మన దేశంలో 542 మంది జడ్జిలు, 134 అదనపు న్యాయమూర్తులు ఉన్నారు. ఖాళీలు నేటికీ 229 న్యాయమూర్తులు, 174 అదనపు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మన రాష్ట్రంలో 28 మంది న్యాయమూర్తులు, 9 మంది అదనపు న్యాయమూర్తులకు అవకాశం ఉందని.. కానీ, 13 మందే న్యాయమూర్తులు ఉన్నారు. లోకాయుక్తకు న్యాయమూర్తులను తీసుకురావాలని యాక్ట్‌కు సవరణ తీసుకొచ్చారు. లోకాయుక్తను బలపర్చడం ద్వారా పరిపాలనను మరింత మెరుగుచేయవచ్చే ఉద్దేశంతో తీసుకువచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌ ట్రెండ్‌ సెట్టర్‌గా మిగిలిపోతారు అని కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

More News

జనసేన పటిష్టానికి పవన్ చర్యలు.. నాగబాబుకు కీలక బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమిని చవిచూశాక.. రానున్న ఎన్నికల్లో అయినా రాణించి పార్టీ సత్తా ఏంటో చూపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుం బిగించారు.

గూగుల్‌కే ఊహించని షాకిచ్చిన ‘లేడీ’..!!

గూగుల్ అంటే తెలియని వారుండరు.. దీన్ని ప్రతిరోజూ వాడకుండా ఉండలేరు కూడా. నిద్రలేచింది మొదలుకుని నిద్రపోయే వరకు ఈ గూగుల్‌తోనే అంతా పని. ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో గూగుల్ సెర్చ్ ఇంజన్ మీద ఆధారపడే వారే.

కాల్ చేసి ఓటీపీ అడుగుతారు.. చెప్పారో అంతే సంగతులు!!

ఇప్పటి వరకూ ఫోన్ నంబర్‌కు పలుమార్లు కాల్స్ రావడం.. ఓటీపీ చెప్పడం ఇలా మోసపోయామని పోలీసులు ఫిర్యాదు చేయడం.. ఇలాంటి వార్తలు టీవీల్లో్, పేపర్లో పెద్ద ఎత్తున వినేవుంటాం.

పేరు మార్చుకుని సీఎంగా ‘యడియూరప్ప’ ప్రమాణం

కర్ణాటక కొత్త సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం చేశారు. కాగా మొదట శుక్రవారం నాడు ఇదివరకున్న యడ్యూరప్ప అనే పేరును ‘యడియూరప్ప’గా మార్చుకుని సీఎం పీఠమెక్కారు. రాజ్ భవన్‌లో గవర్నర్ వాజ్ భాయ్ వాలా..

'మనం సైతం' కు అండగా ఉంటా... కేటీఆర్

మనం సైతం సేవా సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.