వైఎస్ జగన్ 'ట్రెండ్ సెట్టర్'గా మిగిలిపోతారు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ట్రెండ్ సెట్టర్‌గా చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర బాగు కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు అసెంబ్లీలో లోకాయుక్త సవరణ బిల్లుపై కాపు రామచంద్రారెడ్డి మాట్లాడారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా అవినీతే కనిపించిందని.. అవినీతి నిరోధించడానికి సీఎం జగన్ లోకాయుక్త యాక్ట్ ప్రవేశపెట్టారని జగన్ తెలిపారు. ఇలాంటి పనులు చేసిన సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్‌గా మిగిలిపోతారని ఆయన చెప్పారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా..!!
"ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి, సంక్షేమం గురించి రకరకాల బిల్లులు తీసుకువచ్చారు. అవినీతిని నిర్మూలించేందుకు రెండు బిల్లులు తీసుకువస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లు, జ్యుడిషియల్ రివ్యూ బిల్లులు తీసుకొచ్చారు. ఏదైనా పని చేయాలంటే దానికి మనస్సు ఉండాలని.. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ కమిషనర్స్‌ను అపాయింట్ కూడా చేయలేదు. ట్రైబల్ వెల్ఫేర్ కమిటీ కూడా లాగి లాగి చేయనేలేదు. చివరకు మైనార్టీని మంత్రిగా కూడా చేయలేదు. కానీ, సీఎం జగన్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి ప్రజల కోసం అనేక పథకాలు చేపడుతున్నారు" అని కాపు చెప్పుకొచ్చారు.
జగన్ ట్రెండ్ సెట్టర్!!
"భారతదేశంలో 771 జడ్జిలు, 308 అదనపు జడ్జిలు అవసరం ఉంది. కానీ మన దేశంలో 542 మంది జడ్జిలు, 134 అదనపు న్యాయమూర్తులు ఉన్నారు. ఖాళీలు నేటికీ 229 న్యాయమూర్తులు, 174 అదనపు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మన రాష్ట్రంలో 28 మంది న్యాయమూర్తులు, 9 మంది అదనపు న్యాయమూర్తులకు అవకాశం ఉందని.. కానీ, 13 మందే న్యాయమూర్తులు ఉన్నారు. లోకాయుక్తకు న్యాయమూర్తులను తీసుకురావాలని యాక్ట్‌కు సవరణ తీసుకొచ్చారు. లోకాయుక్తను బలపర్చడం ద్వారా పరిపాలనను మరింత మెరుగుచేయవచ్చే ఉద్దేశంతో తీసుకువచ్చారు. సీఎం వైయస్ జగన్ ట్రెండ్ సెట్టర్‌గా మిగిలిపోతారు" అని కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout