విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ ఎల్‌జీ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది కన్నుమూసిన విషయం విదితమే. తెల్లారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పోలీసులు అప్రమత్తమవ్వడంతో మరణాలు చాలానే తగ్గాయి. అయితే ఈ ఘటనపై అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన వాదోపవాదోలు అందరం చూసే ఉంటాం. ఆ కంపెనీకి అనుమతులు మీరు ఇచ్చారంటే.. మీరు ఇచ్చారంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో విశాఖ జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ ఓ డిబెట్‌లో మాట్లాడిన మాటలు తాలుకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం దుమారం రేపే వ్యాఖ్యలు చేస్తోంది. ఎందుకంటే ఆ వీడియో అలా ఉంది మరి.
ఇంతకీ వీడియోలో ఏముంది..!?
ఈ ఘటనపై ఓ ప్రముఖ చానెల్ నిర్వహించిన డిబెట్‌లో దర్మశ్రీ మాట్లాడుతూ.. అనకూడని మాటలు అనేశారు. విశాఖ ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబానికి జగన్ సర్కార్ కేవలం 24 గంటల్లో ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇప్పటికే పలువురికి స్వయంగా మంత్రులే వెళ్లి చెక్‌ను అందజేశారు. ఈ తరుణంలో ఆచి తూచి మాట్లాడాల్సిన దర్శశ్రీ ‘అయ్యో.. మా వాళ్ళు కూడా చచ్చిపోతే బాగుండే మాకు కోటి రూపాయలు వచ్చేవి అని అక్కడి వాళ్ళు అనుకుంటున్నారు’ అని చెప్పకూడదంటూనే చెప్పేశారు. అదే డిబెట్‌లోనే ఈయన మాట్లాడిన మాటలపై పెద్ద రచ్చే జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే వైరల్ అవుతోంది. దీనిపై ఎమ్మెల్యే పదవిలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని.. అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ధర్మశ్రీ.. వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments