విజయసాయికి వైసీపీ ఎమ్మెల్యే ఝలక్..
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. విశాఖకు అప్రకటిత కింగ్.. వైసీపీలో రెండో స్థానం.. అధికారులకు ఎంత చెబితే అంత.. మొన్నటి వరకూ విజయసాయికి ఎదురుతిరిగి మాట్లాడేంత సాహసం కూడా ఎవరూ చేసే వారు కాదు. అలాంటిది సడెన్‌గా.. అది కూడా బహిరంగంగా నిరసన గళం వినిపించాయి. దీనికి తను అప్రకటిత కింగ్‌గా ఉన్న విశాఖే వేదికైంది. మంగళవారం జిల్లా అభివృద్ధి సమీక్ష (డీడీఆర్‌సీ) సమావేశం జరిగింది. ఈ భేటీలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఏకంగా విజయసాయిరెడ్డితోనే మాటల యుద్ధానికి దిగారు. తాము కూడా నిజాయితీపరులమేనంటూ వాదనకు దిగింది. దీంతో విశాఖకు చెందిన అధికారులు.. ఇతర నేతలు షాక్ అయ్యారు.
అసలు విషయంలోకి వెళితే.. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మరికొందరితో కలిసి ఆనందపురం మండలం పాలవలసలో మాజీ సైనికుడికి చెందిన భూమిని కొనుగోలు చేశారు. అయితే మాజీ సైనికులకు చెందిన భూముల క్రయ విక్రయాలకు సంబంధించి కలెక్టర్ నో అబ్జెక్షన్(ఎన్ఓసీ) సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం అనేక మలుపుల కారణంగా ఎన్‌ఓసీ నిలిచిపోయింది. ఇదే కేసులో రిజిస్ట్రేషన్ శాఖపై ఉన్నతస్థాయిలో బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. కాగా.. మంగళవారం జరిగిన సమావేశంలో రెవెన్యూ శాఖ విషయమై చర్చ జరిగింది. ఈ చర్చలో విజయసాయిరెడ్డి పరోక్షంగా పాలవలస భూముల అంశాన్ని ప్రస్తావించారు.
ప్రతి ఆక్రమణ వెనుక రాజకీయ నాయకులు ఉంటున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి పలుమార్లు రాజకీయ నాయకులు అని అనడంపై ధర్మశ్రీ తీవ్రంగా స్పందించారు. భూముల ఆక్రమణల వెనుక నాయకులున్నారని పదేపదే అనడం సరికాదన్నారు. తాము కూడా నిజాయతీపరులమేనని. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నామని.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అంటే ఎంతో ఇష్టమని ధర్మశ్రీ స్పష్టం చేశారు. చట్టబద్ధత ఉండటం వల్లే పాలవలస భూములకు ఎన్‌వోసీ ఇవ్వాలని కోరామన్నారు. భూఆక్రమణల వెనుక దొంగలు ఉంటే వారిపై చర్యలు తీసుకోండి. అంతే తప్ప అందరినీ దొంగలుగా చూడడం సరి కాదంటూ విజయసాయి రెడ్డికి ధర్మశ్రీ ఝలక్ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com