‘పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ’
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్న పవన్‌పై ఆయన కౌంటర్ ఎటాక్ చేశారు. రెండు చోట్ల ఓడిపోయాననే సిగ్గులేకుండా.. ఎందుకు ఓడిపోయాననే విశ్లేషణ చేసుకోకుండా నూతన ప్రభుత్వంపై మాటలదాడిని పవన్‌కల్యాణ్ చేతగానితనం, సినిమా వేషాలకు పరాకాష్టగా భావిస్తున్నామన్నారు. అసలు పుత్రుడు లోకేష్ పనికి రాడని చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను దత్తపుత్రుడిగా తెచ్చుకున్నారన్నారు. పవన్‌కు ఉన్న సినిమా క్రేజ్‌ను అడ్డును పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నాడన్నారు.
విన్యాసాలు చూసి నవ్వుకుంటున్నారు..!
‘పవన్ కల్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కవ.. ఎమ్మెల్యేకి తక్కువ. ఈ రోజు వరకు చట్టసభల్లోకి ప్రవేశించింది లేదు కానీ మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికల్లో వచ్చే కట్టుకథలను ఆధారంగా చేసుకొని పవన్ చేసే విన్యాసాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇసుక కొరతకు కారణాలను విశ్లేషించుకోవడంలో పవన్, చంద్రబాబు విఫలమయ్యారు. గత ప్రభుత్వం ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేసింది. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ధనాన్ని ఇసుక రూపంలో దోపిడీ దొంగల్లా టీడీపీ నేతలు, స్వయాన చంద్రబాబు కొడుకు దోచేసుకున్నారు. అలాంటి పరిస్థితిని రూపుమాపి పేదలకు కూడా ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ నూతన పాలసీ తీసుకువచ్చారు. అది అమలు చేస్తున్న క్రమంలో వరదలు వచ్చాయి. ఎక్కడా ఇసుక తీయడానికి అవకాశం లేకపోవడంతో ఇసుక కొరత కొంత ఏర్పడింది. ఇసుకపై చంద్రబాబు, పవన్ వైఖరి, రాజకీయ విన్యాసాలు చాలా అవమానకరంగా ఉన్నాయి’ అని ఆయన చెప్పుకొచ్చారు.
తెలుసుకుని మాట్లాడు పవన్!
‘2008లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగం అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కచోట ఎన్నికల్లో దాఖలాలు లేవు. నిజంగా చట్టాలు తెలిసి ఉంటే పవన్ ఇలా మాట్లాడి ఉండేవారు కాదు. పచ్చపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పవన్ మాట్లాడడం సిగ్గుచేటని, పవన్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు. స్థాయి తెలుసుకొని పవన్ మాట్లాడితే మంచిది. పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం చిరంజీవి తమ్ముడిగా మొదలైందని, రాజకీయాల్లోకి చిరంజీవి తమ్ముడిగానే వచ్చారు. కానీ ఇప్పుడు అన్నయ్య చిరంజీవితో సంబంధం లేకుండా.. చంద్రబాబు తొత్తులు, కార్పొరేట్ సెక్టార్ తొత్తులతో జతకట్టారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల టికెట్ల కేటాయింపు సొంతంగా తీసుకున్న నిర్ణయమా.. లేక చంద్రబాబు నిర్ణయించారా.. సూటిగా అడుగుతున్నాం. పవన్ నటన ఇప్పటికైనా ఆపేయాలని, బాబు డైరెక్షన్లో నటన చూసి రోడ్డు మీద వెళ్లే వారు కూడా నవ్వుకుంటున్నారు’ అని సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com