మంగళగిరిలో టీడీపీ నేతల రౌడీ రాజకీయం.. వైసీపీ నేత మృతి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంటే.. టీడీపీ కూటమి నేతలు మాత్రం ఓటమి భయంతో వణికిపోతున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే తమ ఉనికికే ప్రమాదం అని భావిస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు రౌడీ రాజకీయాలకు తెరలేపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా నారా లోకేశ్(Nara Lokesh ) బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే లోకేష్ మరోసారి ఓడిపోవడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది.
దీంతో టీడీపీ నేతల్లో అసహనం పెరిగిపోయి వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. తాజాగా టీడీపీ వర్గీయులు చేసిన దాష్టీకానికి వైసీపీకి చెందిన ఓ నేత ప్రాణాలతో పోరాడుతున్నాడు. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తలను దుర్బాషలాడటంతో పాటు ద్విచక్ర వాహనాలతో వారిని ఢీకొట్టారు. ఈ దాడిలో మొత్తం ముగ్గురు గాయపడినట్లు సమాచారం.
వారిలో వైసీపీ బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం మత్తులో వచ్చిన టీడీపీ శ్రేణులు లోకేశ్ విజయం సాధించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే ముందుగా ఓ యువకుడు వచ్చి వైసీపీ ప్రచారాన్ని ఆపేయాలంటూ దురుసుగా ప్రవర్తించాడు. తరువాత మరో ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై వచ్చి వైసీపీ నేతలను, కార్యకర్తలను ఢీకొట్టారు. రోడ్డుపై తీవ్రగాయాలతో రక్తపు మడుగులో ఉన్న వారిపై కాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
వెంకట్ రెడ్డిపై దాడి జరుగుతుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. అయితే ఈ దాడిలో తలకు తీవ్ర గాయం కావడంతో వెంకట్ రెడ్డి కోమాలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. తమ నాయకుడు లోకేష్ ఓడిపోతారనే భయంతోనే టీడీపీ నేతలు ఇటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముగిసేలోపు టీడీపీ రౌడీ రాజకీయాలను ఇంకెంతమంది బలి అవుతారో అని స్థానికులు భయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout