'యాత్రికుడు' టీజర్, ట్రైలర్, బ్యానర్, పోస్టర్ లాంచ్
Saturday, March 11, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ నటరాజ లక్ష్మి నరసింహస్వామి మూవీస్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం యాత్రికుడు`. వారణాసి సూర్య దర్శకత్వంలో యు.వేదప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన సమావేశంలో బ్యానర్‌ను సంతోషం పత్రిక అధినేత, ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి, టీజర్‌ను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ట్రైలర్‌ను పోచారం భాస్కర్ రెడ్డి, పోస్టర్‌ను ప్రతాని రామకృష్ణ `గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవతి గౌడ్,డిజిక్విస్ట్ బసిరెడ్డి, సి.జె.శోభారాణి,కె.వి.మోహన్ గౌడ్, హీరో అనూప్, సినిమాటోగ్రాఫర్ ఫణీంద్రవర్మ, ఎడిటర్ ఉదయ్, దర్శకుడు వారణాసి సూర్య, నిర్మాత వేదప్రకాష్, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ పైడిశెట్టి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. యాత్రికుడు ట్రైలర్ చాలా బావుంది. ఇది చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలా చేయడానికి నా వంతు సహకారం అందిస్తాను అన్నారు.
పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ బావుంది. దర్శక నిర్మాతలకు సినిమా పెద్ద విజయం సాధించి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. కాశీ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా 'ఇంద్ర' చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. అలాగే కాశీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి. ఈ సినిమాలో రీ రికార్డింగ్ చాలా బావుంది. డైరెక్టర్ సూర్య చాలా కాలంగా నాకు తెలుసు.
చాలా మంచి కదాంశంతో ఈ సినిమా చేశాడు. వేద ప్రకాష్ వంటి నిర్మాత దొరకడం సూర్య అదృష్టం అన్నారు.
దర్శకుడు వారణాసి సూర్య మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే ఈ సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాను. మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరాయి. సి.వి.ఎల్ స్టూడియో రవి చక్కటి సహకారం అందించారు. అందరికీ థాంక్స్ అన్నారు.
నిర్మాత యు.వేదప్రకాష్ మాట్లాడుతూ.. కొరియోగ్రాఫర్ అయిన నేను నిర్మాతగా మారి చేసిన తొలి ప్రయత్నం. సూర్య మంచి కథతో ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో 85 మంది కొత్త నటీనటులు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రామ్ పైడి శెట్టి, కెమెరా: ఫణీంద్ర వర్మ, ఎడిటింగ్: ఉదయ్ మాడుపూరి, పాటలు: రామ్ పైడి శెట్టి, బాంబే బోలె, సహ నిర్మాత: రామ్మూర్తి ఉండ్రాజనవరపు, నిర్మాత: యూ.వేదప్రకాష్, రచన- దర్శకత్వం: వారణాసి సూర్య.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments