రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర ప్రారంభించిన రొజు యాత్ర షూటింగ్ ప్రారంభం

  • IndiaGlitz, [Sunday,April 08 2018]

సినిమాని వ్యాపారంగా కాకుండా ఫ్యాష‌న్ గా చిత్రాలు నిర్మించే నిర్మాణ సంస్థ‌లు తెలుగు ఇండ‌స్ట్రిలో చాలా త‌క్కువుగా వున్నాయి. ఆ కోవ‌లోకి వ‌చ్చే మ‌రో నిర్మాణ సంస్థ 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అని చెప్పుకోవ‌చ్చు. ఈ బ్యాన‌ర్ పై మెద‌టి ప్ర‌య‌త్నంగా నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి లు సంయుక్తంగా భ‌లేమంచిరోజు అనే చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రం ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా డిఫెరెంట్ స్క్రీన్‌ప్లే తొ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపోందించి విజ‌యాన్ని సాధించారు. అలాగే రెండ‌వ ప్ర‌య‌త్రంగా తాప్సి ని హీరోయిన్ గా పెట్టి మ‌నుషుల్ని చూసి దెయ్యాలు బ‌య‌ప‌డే ఓ హిలిరియ‌స్ కాన్సెప్ట్ తో చిత్రాన్ని తెర‌కెక్కించారు.

2017 లొ చిన్న చిత్రాల్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్ప‌డు మ‌రో మెట్టు ఎక్కి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజి ముఖ్య‌మంత్రి దివంగ‌త నేత డాక్ట‌ర్‌. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నారు.  ఈ చిత్రంలో డా..వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి పాత్ర‌లో మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టిస్తున్నారు.

మమ్మూట్టి తెలుగు లో చాలా కాలం త‌రువాత న‌టించ‌డం విశేషం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9 నుండి ప్రారంభించ‌నున్నార‌న్న సంగ‌తి తెలిసిందే.. అయితే ఏప్రిల్ 9 కి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కి సంబందం ఏంట‌ని చాలా మంది సందేహ‌ ప‌డ్డారు.

2003 లో డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు పేద వాళ్ళ క‌ష్టాల్ని స్వ‌యంగా తెలుసుకోవ‌టానికి క‌డ‌ప దాటి వ‌స్తున్నా.. మీ గ‌డ‌ప క‌ష్టాలు విన‌టానికి అనే నినాదంతో పాద‌యాత్ర మెద‌లు పెట్టిన రోజు కావున అదే రోజు యాత్ర చిత్రం షూటింగ్ కూడా ప్రారంభిస్తున్నారు. 

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. 60 రొజుల్లో 1500 కిలోమీట‌ర్స్ కాలి న‌డ‌క‌తో క‌డ‌ప దాటి ప్ర‌తి ఇంటి గ‌డ‌ప లొకి వెళ్ళి పెద‌వాడి క‌ష్టాన్ని, అక్క‌చెల్లెళ్ళ భాద‌ల్ని, రైతుల ఆవేద‌న‌ని చూసి వారితో క‌ల‌సి న‌డిసి వారి గుండె చ‌ప్పుడుగా మారి వారి క‌ష్టాల్ని త‌న క‌ళ్ళ‌తో చూసి బ‌రువెక్కిన గుండెతో ప్ర‌జ‌ల హ్రుద‌యాల్లో స్థానం సంపాయించిన  ఎకైన నాయ‌కుడు దివంగ‌త నేత డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు.. పేద‌ప్ర‌జ‌ల క‌ష్టాల్ని స్వ‌యంగా విన‌టానికి పాద‌యాత్ర మెద‌లు పెట్టిన ఏప్రిల్ 9న మా యాత్ర చిత్రం ప్రాంభిస్తున్నాము..

మా బ్యాన‌ర్ 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ లో ఎప్పుడూ కాంప్ర‌మైజ్ అయ్యి చిత్రాలు తీయ‌లేదు. మా గ‌త రెండు చిత్రాలు కూడా క‌థ డిమాండ్ ప్ర‌కారం ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశాము. అదే విధంగా మేము త‌ల‌పెట్టిన ఈ భారీ చిత్రాన్ని  ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కిస్తాము. మా గ‌త రెండు చిత్రాలు మాదిరిగానే మా ప్రోడ‌క్ష‌న్ వాల్యూస్ ని రెట్టింపు చేసేలా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కి అందిస్తాము. అని అన్నారు. 

More News

అర్జున్, జేడీ చక్రవర్తి కాంబినేషన్ లో 'కాంట్రాక్ట్'

యాక్షన్ కింగ్ అర్జున్ చాలా రోజుల విరామం తర్వాత హీరోగా నటిస్తున్న తెలుగు చిత్రం కాంట్రాక్ట్. ఇందులో హీరో జేడీ చక్రవర్తి చాలా రోజుల తర్వాత విలన్‌గా నటిస్తుండటం విశేషం.

'పంతం' రిలీజ్ డేట్ మారింది

'ఆంధ్రుడు', 'య‌జ్ఞం', 'ల‌క్ష్యం', 'శౌర్యం', 'లౌక్యం' వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్

త్రివిక్ర‌మ్‌.. ఎన్టీఆర్ సినిమాతో ట్రాక్ ఎక్కుతారా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెబితే.. తూటాల్లా పేలే డైలాగులు, మనసును హత్తుకునే మాటలు, హాయిగా నవ్వుకునే పంచ్‌లు గుర్తుకొస్తాయి.

'కాలా' విడుద‌ల తేదీ పై క‌థ‌నాలు

సూపర్ స్టార్ రజనీ కాంత్, డైరెక్టర్ పా.రంజిత్ కలయికలో తెరకెక్కిన చిత్రం 'కాలా'. రజనీ అల్లుడు, నటుడు ధనుష్  వండర్ బేర్ ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించారు.

స్వాతంత్ర్యోద్యమం నేపథ్యంలో రాజ‌మౌళి మల్టీస్టారర్ మూవీ?

'బాహుబలి' సిరీస్‌తో తన దర్శకత్వప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అబ్బురపరిచారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన నుంచి వచ్చే తదుపరి చిత్రం ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.