ఈ ఏడాది జనవరిలో `యన్.టి.ఆర్` కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు వస్తే ఫిబ్రవరి రాజన్న కథతో `యాత్ర`ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి జీవిత కథతో, ప్రధానంగా ఆయన చేసిన పాదయాత్ర కథతో రూపొందిన చిత్రం ఇది. కడప దాటి ప్రతి గడపకూ వెళ్లిన జననేతకు సంబంధించిన కథ. ఇప్పటిదాకా చిన్న చిత్రాలతో తన మార్కు వేసుకుంటూ వచ్చిన మహి.వి.రాఘవ్ ఈ నేత కథను కళ్లకు కట్టినట్టు చెప్పాడా? లేదా? లెట్స్ హావ్ ఎ లుక్...
కథ:
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి(మమ్ముట్టి) రాయలసీమలో బలమైన నాయకుడు. ఆయనకు కె.వి.పి(రావు రమేష్) ప్రాణ స్నేహితుడు. హై కమాండ్ కాదన్నా కూడా తన వారికే టికెట్స్ ఇవ్వమని .. వారైతే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారని వారికి టికెట్స్ ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో అధికార పార్టీ మనదేశం ముందస్తు ఎన్నికలకు వెళుతుంది. వై.ఎస్.ఆర్ పార్టీకి ఎన్నికలకు వెళ్లే సమయం తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అసలు రాజకీయ నాయకులుగా ఆలోచించాం కానీ నాయకులుగా ఆలోచించాలని నిర్ణయం తీసుకున్న వై.ఎస్ పాదయాత్ర చేయాలనుకుంటాడు. హై కమాండ్ నుండి పూర్తి స్తాయి పర్మిషన్ రాకపోయినా పాదయాత్రను స్టార్ట్ చేస్తాడు వై.ఎస్. ప్రజల్లో వై.ఎస్‌కు, పార్టీకి ఆదరణ రోజు రోజుకీ పెరుగుతూ వస్తుంది. ఆ క్రమంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని వారి సమస్యలు తీర్చాలనుకుంటాడు. వై.ఎస్. ఎలాంటి పరిస్థితులను చూశాడు? ప్రజల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
సినిమాకు ప్రధాన బలం మమ్ముట్టి. దాదాపు పాతికేళ్ల తర్వాత మమ్ముట్టి నటించిన చిత్రమిది. వై.ఎస్ రాజకీయ జీవితంలో పాదయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ పాదయాత్ర ఘట్టాన్ని దర్శకుడు మహి సినిమా రూపంలో మలిచాడు. వై.ఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవేశ పెట్టిన పథకాలకు ఆయన పాదయాత్రే కారణమని.. ఆయన కొన్ని పరిస్థితులను చూసి చలించి తీసుకున్న నిర్ణయాలే అవని సినిమా రూపంగా చెప్పే ప్రయత్నం చేశారు. సినిమాలో రైతులకు గిట్టుబాట ధర కల్పించడం.. ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా ఉచిత వైద్యం, ఉచిత విద్యను అందించడం ఇవన్నీ సినిమాలో ఎమోషనల్ కోణంలో చూపించారు. కె సంగీతం, నేపథ్య సంగీతం సినిమాలో సన్నివేశాలకు బలాన్నిచ్చాయి. సత్యన్ సూరన్ కెమెరా పనితం బావుంది.
మైనస్ పాయింట్స్:
వై.ఎస్ పాత్రను గొప్పగా చూపించే క్రమంలో ఆయనకు అండదండలుగా నిలిచిన కె.వి.పి. సూరీడు సహా ఇతర పాత్రకు పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. ఇక సినిమా కథాంశం పరంగా చాలా సినిమాటిక్ యాంగిల్స్‌లో చూపించారు. వై.ఎస్ హై కమాండ్‌కు ఎదురెళ్లాడని సినిమాలో చూపించారు. కానీ సినిమాలో చూపించనంత వై.ఎస్.ఆర్ హైకమాండ్‌ను ఎదిరించలేదు. సినిమా ఫస్టాఫ్ స్లో గా ఉన్నట్లు అనిపిస్తుంది.
సమీక్ష:
వైఎస్ రాజకీయ జీవితంలో పాదయాత్ర ప్రాముఖ్యతను చూపించే క్రమమే ఈ చిత్రం. అయితే సినిమాలో ఎక్కువగా రాజకీయ కోణమే చూపించారు. వై.ఎస్ ముఖ్యమంత్రిగా ఎదిగిన క్రమంలో చేసిన పాదయాత్రలో పరిస్థితులను ఎమోషనల్‌గా చూపించినా.. మిగిలిన కథంతా స్లోఫేజ్‌గా సాగుతుంది. కానీ రాజకీయ పరిస్థితులను తెరపై ఆవిష్కరించేటప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స యాడ్ చేయలేం. కాబట్టి దాన్ని నిజానికి దగ్గరగా చూపాల్సిందే. తొలి సన్నివేశంలో అనసూయపై ప్రత్యర్థులు దాడి చేయాలనుకునేటప్పుడు వై.ఎస్ జెండా చూసి వెనక్కి జడవడం, నామినేషన్ వేసే సందర్భంలోనూ ప్రత్యర్థి కూడా రాజశేఖర్ రెడ్డి మాటలకు విలువ ఇవ్వడం.. పాదయాత్ర సమయంలో నాగినీడు పాత్ర నా ఓటు నీకే అనే సందర్భం.. ఇలాంటి సన్నివేశాలు అభిమానులకు నచ్చేలా ఉంటాయి. తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్రవేసి వ్యక్తుల్లో స్వర్గీయ ఎన్టీఆర్ అయితే.. ఆ తర్వాత ఆ రేంజ్‌లో తనదైన రీతిలో కొత్త ముద్రను వేసుకున్న నేత రాజశేఖర్ రెడ్డి. పాక్షన్ ప్రాంతం నుండి వచ్చిన నేత రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి కావడం ...... అది కూడా హై కమాండ్‌ను దాటకుండానే వారి విధేయుడిగా ఉంటూ.. ప్రజలకు సేవకుడినే అని చెప్పేలా ప్రవర్తించడం ఆ సన్నివేశాలు.. ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇక ఎమోషనల్ సీన్స్‌ను హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు మహి వి.రాఘవ్ సన్నివేశాలకు తనదైన రీతిలో నాటకీయ కోణాన్ని జోడించి తెరకెక్కించారు. కథంతా మమ్ముట్టి చుట్టూనే తిరిగింది. కథలో వై.ఎస్ ఆత్మ అని చెప్పే కె.వి.పి పాత్రకు.. వై.ఎస్ ముఖ్య అనుచరుడు సూరీడు పాత్రకు, వై.ఎస్.రాజారెడ్డి గా నటించిన జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇలా పాత్రధారులకు ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయింది. రాజకీయ నాయకుల జీవిత కథలు ప్రేక్షకులకు ముఖ్యంగా యూత్ ప్రేక్షకులకు నచ్చుతాయా అంటే అనుమానమే.. ఈ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. అయితే వై.ఎస్‌కు ఉన్న అభిమానగణానికి మాత్రం సినిమా తప్పకుండా నచ్చుతుంది. దానికి తోడు చివరి రెండు, మూడు నిమిషాలు నిజమైన వై.ఎస్.ఆర్ సన్నివేశాలను తీసుకోవడం.. వాటిలో జగన్‌ను ఇన్‌క్లూడ్ చేసి చూపడం ఇవన్నీ సినిమాకు ప్లస్సే
బోటమ్ లైన్: వై.ఎస్ అభిమానులను మెప్పించే 'యాత్ర'
Comments