నేను విన్నాను.. నేనున్నాను

  • IndiaGlitz, [Friday,December 21 2018]

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తోన్న చిత్రం 'యాత్ర'. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. వర్షాలు లేకుండా రైతులు పడే ఇబ్బందలను తెలుసుకోవడానికి రాజశేఖర్ రెడ్డి చేసిన పాద యాత్ర, ఆ సవుయంలో ఆయన పడ్డ మానసిక సంఘర్షణను ఈ టీజర్‌లో ఆవిష్కరించారు.

'నీళ్లుంటే క‌రెంట్ ఉండ‌దు. క‌రెంట్ ఉంటే నీళ్లుండ‌దు... అని ఓ రైతు త‌న ఆవేద‌న‌ను వెల్ల‌గ‌క్కుకోవ‌డంతో టీజ‌ర్ మొదలైంది. రైతులు పంట‌లు చేతిక అంద‌క ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న స‌న్నివేశాల‌ను టీజ‌ర్‌లో చూపించారు. ఓ రైతు ప‌క్క‌న వై.ఎస్‌.ఆర్ పాత్ర‌ధారి మ‌మ్ముట్టి కూర్చుని 'నేను విన్నాను.. నేనున్నాను' అంటూ ఆయన ఓ రైతుకు ఇచ్చిన భరోసా కూడా ఈ టీజర్‌లో కనపడుతుంది.

రాజశేఖర్ రెడ్డి జీవితంలో కొన్ని ఘట్టాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను దర్శకుడు మహి.వి.రాఘవ్ తెరకెక్కించారు. 70 ఎం.ఎం.ఎంటర్‌ైటెన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలవుతుంది.

More News

విజ‌య్ ఆంటోని స్ట్ర‌యిట్ తెలుగు మూవీ ప్రారంభం

విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్ హీరోలుగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నవీన్ ఎం. దర్శకత్వంలో అమ్మ క్రియేషన్స్ బ్యానర్ పై సర్వన్త్ రామ్ క్రియేషన్స్

ఆకట్టుకున్న కొత్త హీరోయిన్స్

కొత్త‌ద‌నం అనేది తెలియ‌ని ఓ అహ్లాదాన్ని, ఉత్సాహాన్నిస్తుంది. సినిమా రంగానికి వ‌స్తే ప్ర‌తి ఏడాది ఎంతో మంది కొత్త హీరోయిన్స్ ప‌రిచ‌యం అవుతూనే ఉంటారు.

అతిథి పాత్ర‌లో రాంచ‌ర‌ణ్‌

మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడట‌. ఇంత‌కు ఎవ‌రి సినిమాలో అనుకుంటున్నారా! .. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో. అంటే సైరా న‌ర‌సింహారెడ్డిలో కాదు.

ర‌జ‌నీకాంత్‌తో కీర్తి

'2.0' త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ 'పేట్ట‌' త‌మిళంలో సంక్రాంతికి.. తెలుగులో జ‌న‌వ‌రి చివ‌రి వారం లేదా ఫిబ్ర‌వ‌రి 1న విడుద‌లవుతున్నాయి. కాగా ర‌జ‌నీకాంత్, ఎ.ఆర్.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా

దివ్యాంగురాలి కోసం ప‌రీక్ష రాసిన తనీశ్‌

స‌హాయం చేయాలంటే ఆర్ధికంగానే కాదు.. మ‌న‌సుంటే ఏదో ఒక రూపంలో స‌హాయం చేయ‌వ‌చ్చు . దీన్ని అక్ష‌రాలా పాటించాడు హీరో త‌నీశ్‌. ఓ దివ్యాంగురాలి కోసం ఆయ‌న ఎగ్జామ్ హాల్‌కి వెళ్లి ప‌రీక్ష రాశారు.