నేను విన్నాను.. నేనున్నాను
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తోన్న చిత్రం 'యాత్ర'. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. వర్షాలు లేకుండా రైతులు పడే ఇబ్బందలను తెలుసుకోవడానికి రాజశేఖర్ రెడ్డి చేసిన పాద యాత్ర, ఆ సవుయంలో ఆయన పడ్డ మానసిక సంఘర్షణను ఈ టీజర్లో ఆవిష్కరించారు.
'నీళ్లుంటే కరెంట్ ఉండదు. కరెంట్ ఉంటే నీళ్లుండదు... అని ఓ రైతు తన ఆవేదనను వెల్లగక్కుకోవడంతో టీజర్ మొదలైంది. రైతులు పంటలు చేతిక అందక ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశాలను టీజర్లో చూపించారు. ఓ రైతు పక్కన వై.ఎస్.ఆర్ పాత్రధారి మమ్ముట్టి కూర్చుని 'నేను విన్నాను.. నేనున్నాను' అంటూ ఆయన ఓ రైతుకు ఇచ్చిన భరోసా కూడా ఈ టీజర్లో కనపడుతుంది.
రాజశేఖర్ రెడ్డి జీవితంలో కొన్ని ఘట్టాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను దర్శకుడు మహి.వి.రాఘవ్ తెరకెక్కించారు. 70 ఎం.ఎం.ఎంటర్‌ైటెన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com