"ఈనాటి ఈ సుప్రభాతగీతం నీకిదే అన్నది స్వాగతం " అంటూ మెదలైన 'యాత్ర'
Send us your feedback to audioarticles@vaarta.com
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా రాష్ట్రరాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ లొ మళయాల సూపర్‌స్టార్ మమ్మూట్టి నటిస్తున్న యాత్ర చిత్రం నుండి మెదటి సింగిల్ విడదల చేశారు. దర్శకుడు మహి వి రాఘవ్ ఈ బయెపిక్ ని తెరకెక్కిస్తున్నారు. మడమతిప్పని నాయికుడి పాత్రలో నటిస్తున్న మమ్మట్టి పూర్తిగా ఆ ప్రజానాయకుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మెదటి లుక్ కి, టీజర్ కి రెండు రాష్ట్రాల ప్రజల నుండి అనూహ్యమైన స్పందన రావటంతో యూనిట్ అంతా చాలా ఆనందంగా వున్నారు.
తెలుగు ప్రజల ఎమెషనల్ కథని , ఫ్యాషనేట్ యాత్రని నిర్మిస్తున్న 70 ఎం ఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ :
సినిమాని వ్యాపారంగా కాకుండా ఫ్యాషన్ గా చిత్రాలు నిర్మించే నిర్మాణ సంస్థలు తెలుగు ఇండస్ట్రిలో చాలా తక్కువుగా వున్నాయి. ఆ కోవలోకి వచ్చే మరో నిర్మాణ సంస్థ 70 ఎం ఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ . ఈ బ్యానర్ పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి లు సంయుక్తంగా భలేమంచిరోజు , ఆనందోబ్రహ్మ చిత్రాలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. బ్యానర్ లో హ్యట్రిక్ చిత్రంగా రూపోందుతున్న యాత్ర ని ప్రెస్టెజియస్ ప్రోజెక్ట్ గా, అత్యంత భారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమెషన్ తో కూడిన పాత్రలు, పాత్ర తీరులు కనిపిస్తాయి. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ: 60 రొజుల్లో 1500 కిలోమీటర్స్ కాలి నడకతో కడప దాటి ప్రతి ఇంటి గడప లొకి వెళ్ళి పెదవాడి కష్టాన్ని, అక్కచెల్లెళ్ళ భాదల్ని, రైతుల ఆవేదనని చూసి వారితో కలసి నడిసి వారి గుండె చప్పుడుగా మారి వారి కష్టాల్ని తన కళ్ళతో చూసి బరువెక్కిన గుండెతో ప్రజల హ్రుదయాల్లో స్థానం సంపాయించిన ఎకైన నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.. ఆయన బయెపిక్ ని ఆయన ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా చిత్రీకరిస్తున్నాము. రీసెంట్ గా మెము విడుదల చేసిన టీజర్ కి అనూహ్యమైన స్పందన రావటం విశేషం.
మా బ్యానర్ 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ లో ఎప్పుడూ కాంప్రమైజ్ అయ్యి చిత్రాలు తీయలేదు. మా గత రెండు చిత్రాలు కూడా కథ డిమాండ్ ప్రకారం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాము. అదే విధంగా మేము తలపెట్టిన ఈ భారీ సంకల్ప యాత్ర ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాము. మా చిత్రానికి సంబందించి మెదటి సింగిల్ ని సిరివెన్నెల సీతారామశాస్ట్రి గారు "ఎక్కడో పైన లేదు యుధ్ధమన్నది.
అంతరంగమే కదనరంగమైనది..ప్రాణమే బాణమల్లే తరుముతున్నది నిన్ను నీవు జయించి రారా రాజశేఖరా" అంటూ ఎమెషనల్ లిరిక్స్ అందించగా , కె అద్బతమైన సంగీతాన్ని అందించాడు. ఈ సింగిల్ ని దివంగత నేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా విడుదల చేశాము. త్వరలోనే చిత్రానికి సంబందించి మరిన్ని అప్‌డేట్స్ ఇస్తాము. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments