'యాత్ర 2' అక్కడ నుండే మొదలు
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి నాటి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర చాలా కీలకమైనది. ఆ పాదయాత్ర ఆధారంగా వై.ఎస్.ఆర్ పాత్రలో మమ్ముట్టితో మహి వి.రాఘవ్ తెరకెక్కించిన చిత్రం 'యాత్ర'. ఇప్పుడు చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి.
వై.ఎస్.ఆర్ చనిపోవడం.. తర్వాత వై.ఎస్.జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో ఆయన అపజయం పొందినా 2019లో మాత్రం పెద్ద విజయాన్ని దక్కించుకున్నారు.
వై.ఎస్.జగన్ విజయంలో కూడా ఆయన చేసిన పాదయాత్ర కీలకంగా మారింది. ఈ పాదయాత్రను బేస్ చేసుకుని మహి.వి.రాఘవ్ మళ్లీ 'యాత్ర 2' తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం ఎక్కడ నుండి ప్రారంభం అవుతుంది? అనే ప్రశ్నకు దర్శకుడు మహి ఓ క్లారిటీ ఇచ్చేశాడు. "వై.ఎస్.రాజారెడ్డి సమాధి వద్ద నుండి రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. వై.ఎస్.ఆర్ సమాధి వద్ద నుండి జగన్ పాదయాత్రను ప్రారంభించారు.అక్కడే నుండే 'యాత్ర 2' మొదలవుతుంది" అన్నారు మహి వి.రాఘవ్. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. వై.ఎస్.జగన్ పాత్రలో హీరో సూర్యను నటింప చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com