Yatra 2:ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర2'.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

  • IndiaGlitz, [Friday,April 12 2024]

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర2' చిత్రం ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రి వైఎస్సార్ మరణం నుంచి ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసే వరకు జరిగిన ఘటనలు, సంఘటనలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్‌సీపీ స్థాపించడం.. ఆ తర్వాత ఉప ఎన్నికలు.. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? చంద్రబాబు పాత్ర నుంచి జగన్ పార్టీకి ఎటువంటి పోటీ ఎదురైంది? అనే అంశాలపై ఈ సినిమా తెరకెక్కించారు.

వైఎస్ఆర్ మరణం దగ్గర మొదలయ్యే 'యాత్ర 2' కథ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేవరకు ఉంటుంది. అయితే ఈ మధ్య ఏం జరిగింది? అనే విషయాల్ని సినిమాలో చాలా ఎమోషనల్‌గా చూపించారు డైరెక్టర్ మహి వి రాఘవ. మూవీలో 'నాయకులకు తెలిసినంత రాజకీయం కార్యకర్తలకు తెలియదు కదా సార్'.. 'జగన్ రెడ్డి కడపోడు సార్' అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. దేవుడు అంటే నమ్మకం.. వైఎస్సార్ అంటే నిజం.. ఇలాంటి డైలాగ్స్ వైఎస్సార్ వ్యక్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాయి. ఆయన మరణానంతరం జగన్‌ను ఎలా హింసించారు.. విలన్‌గా చూపడానికి ఎలాంటి ఎత్తులతు వేశారని ఇందులో చూపించారు. ఆ కుట్రలను జగన్ ఎలా ఎదుర్కొన్నాడనేది రసవత్తరంగా మలిచారు.

అలాగే చంద్రబాబు నిజస్వరూపం ఎలాంటిది అనేది ఈ చిత్రంలో స్పష్టంగా చూపించారు. అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు ఎవరిని తక్కువ చేసి చూపించలేదు. 'మనం తలపడుతున్నది చంద్రబాబుతో, తక్కువ అంచనా వేయకూడదు' అని జగన్ పాత్రధారితో డైలాగ్ చెప్పించడం ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే 'యాత్ర' మూవీలో వైఎస్సార్ పాత్రలో జీవించిన సీనియర్ నటుడు మమ్ముట్టి 'యాత్ర 2'లోనూ మమ్ముట్టి మరోసారి తనదైన నటన, డైలాగ్ డెలివరీతో మెస్మరైజ్ చేశారు. ఇక తమిళ హీరో జీవా జగన్ పాత్రలో అద్భుతంగా నటించారు. తెరపై జీవాను చూసినంతసేపు జగన్‌ను చూసినట్లే ఉంటుంది. అంతలా ఆ పాత్రలో లీనమైపోయారు. ఇక వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్, విజయమ్మగా ఆశ్రిత వేముగంటి, చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్‌లు, శుభలేఖ సుధాకర్, కిషోర్ కుమార్ పొలిమేర, తదితరులు అద్భుతంగా నటించారు.

More News

Pawan Kalyan:జైలుకు..బెయిల్‌కు మధ్య జగన్‌ జీవితం ఊగిసలాడుతోంది: పవన్ కల్యాణ్‌

జైలుకు.. బెయిల్‌కు మధ్య జగన్‌ జీవితం ఊగిసలాడుతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఎద్దేవా చేశారు.

Pemmasani:అవినీతి సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతుంది: పెమ్మసాని

ఐదేళ్లు జనం మొహం చూడకుండా పాలించిన ఏకైక సీఎంగా జగన్ నిలిచిపోతారని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

AP Inter Results:ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో

CM Jagan:సీఎం జగన్ విద్యా సంస్కరణలకు అద్భుతమైన ఫలితాలు

ఏపీ సీఎంగా వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్య వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు.

Ram Charan:రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం.. డాక్టరేట్ ప్రకటించిన ప్రముఖ యూనివర్సిటీ

RRR మూవీతో రామ్‌చరణ్‌ క్రేజ్ ప్రపంచవ్యాప్తమైంది. మెగా పవర్‌స్టార్ నుంచి గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన చరణ్‌ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు.