Yatra 2:నేను విన్నాను.. నేను ఉన్నాను.. ట్రెండింగ్‌లో 'యాత్ర-2' ట్రైలర్..

  • IndiaGlitz, [Saturday,February 03 2024]

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'యాత్ర' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఎన్నికల ముందు ముందు విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర 2‘ పేరుతో సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌, మోషన్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైటర్ విడుదలైంది. వైఎస్సార్ చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు, జగన్ జైలు జీవితం, పాదయాత్రను ఇందులో చూపించబోతున్నారు.

‘పుట్టుక‌తో చెవుడు ఉందన్న దాని వ‌ల్ల మాట‌లు కూడా రావు. ఏదో మెషిన్ పెడితే విన‌ప‌డి మాట‌లు వ‌స్తాయ‌ని డాక్టర్లు చెప్పార‌న్నా, మాకు అంత స్థోమ‌త లేదు’’ అంటూ ఓ పేద మ‌హిళ వైఎస్సార్ ద‌గ్గర త‌న స‌మ‌స్యను చెప్పుకుంటుంది. అయితే ఆయ‌న సెక్రట‌రీ ఓ వ్యక్తి మీద‌నే అంత ఖ‌ర్చు పెడితే రాష్ట్ర బ‌డ్జెట్ ప్రకారం క‌ష్టమ‌ని చెబుతారు. ‘‘నువ్వు చెప్పింది క‌రెక్టేన‌య్యా నాకు అర్థమైంది. కానీ మ‌నం చేయ‌లేమ‌నే మాట ఈ పాప‌కి అర్థమ‌య్యేలా చెప్పు’’ అనే ఎమోష‌న‌ల్ సీన్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది.

2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్రప్రదేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, జగన్ పాద‌యాత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. చివర్లో నేను విన్నాను.. నేను ఉన్నాను అనే డైలాగ్‌తో ముగించారు. ఈ ట్రైలర్ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఉంది. 'యాత్ర'లో వైఎస్సార్ పాత్రలో సీనియర్ హీరో మమ్ముట్టి కనిపించగా.. ఈ సినిమాలో తమిళ నటుడు జీవా జగన్ పాత్రలో నటించారు.

ఇక చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్‌తో పాటు పలువురు ప్రముఖులు యాక్ట్ చేశారు. కాగా యాత్ర 2' చిత్రాన్ని త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘యాత్ర’ సినిమా ఫిబ్రవరి 8, 2019లో విడుద‌ల కాగా.. ‘యాత్ర 2’ ని కూడా అదే రోజు అంటే ఫిబ్రవరి 8, 2024న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీ కోసం వైసీపీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

More News

CP:తహసీల్దార్ రమణయ్య హత్య కేసు నిందితుడిని గుర్తించాం: సీపీ

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు నిందితుడిని గుర్తించామని విశాఖ పోలీస్ కమిషనర్‌ రవిశంకర్‌ తెలిపారు.

Poonam Pandey:ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబూ.. నేను చనిపోలేదు: పూనమ్ పాండే

తాను క్యాన్సర్‌తో చనిపోలేదని బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఓ వీడియో విడుదల చేసింది.

LK Advani:బిగ్ బ్రేకింగ్: ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటన

రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సహ వ్యవస్థాపకులు ఎల్‌కే అద్వానీ(LK Advani)కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది.

YCP :వైసీపీ ఆరో జాబితాలో కీలక మార్పులు.. కొన్ని స్థానాల్లో రివర్స్ నిర్ణయాలు..

ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తుంది. దీంతో అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనలో దూకుడు పెంచింది.

BRS:బీఆర్ఎస్‌ పార్టీకి భారీ షాక్.. మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా..

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం, ఆ పార్టీ సీనియర్ నేత తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేశారు.