Yatra 2:తెలుగు రాష్ట్రాల్లో 'యాత్ర-2' ప్రభంజనం.. దద్దరిల్లుతోన్న థియేటర్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన 'యాత్ర-2' మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. థియేటర్ల వద్ద వైఎస్సార్ అభిమానుల కోలాహలం అంబరాన్నింటింది. జై జగన్.. జోహార్ వైఎస్సార్ నినాదాలో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. తండ్రి మరణం నుంచి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసే వరకు జరిగిన ఘటనలు, సంఘటనలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్‌సీపీ పార్టీని స్థాపించడం.. ఆ తర్వాత ఉప ఎన్నికలు.. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? చంద్రబాబు పాత్ర నుంచి జగన్ పార్టీకి ఎటువంటి పోటీ ఎదురైంది? అనే అంశాలపై ఈ సినిమా తెరకెక్కించారు.
మూవీలో 'నాయకులకు తెలిసినంత రాజకీయం కార్యకర్తలకు తెలియదు కదా సార్'.. 'జగన్ రెడ్డి కడపోడు సార్' అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గొప్పతనం ఈతరం వాళ్లకు తెలిసేలా చాలా ఎమోషనల్‌గా సినిమాను తెరకెక్కించారు. అప్పటి రాజకీయ పరిస్థితులు కళ్లకు కట్టారు. దేవుడు అంటే నమ్మకం.. వైఎస్సార్ అంటే నిజం.. ఇలాంటి డైలాగ్స్ వైఎస్సార్ వ్యక్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాయి. ఆయన మరణానంతరం జగన్‌ను ఎలా హింసించారు.. విలన్‌గా చూపడానికి ఎలాంటి ఎత్తులతు వేశారని ఇందులో చూపించారు. ఆ కుట్రలను జగన్ ఎలా ఎదుర్కొన్నాడనేది రసవత్తరంగా మలిచారు.
అలాగే చంద్రబాబు నిజస్వరూపం ఎలాంటిది అనేది ఈ చిత్రంలో స్పష్టంగా చూపించారు. అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు ఎవరిని తక్కువ చేసి చూపించలేదు. 'మనం తలపడుతున్నది చంద్రబాబుతో, తక్కువ అంచనా వేయకూడదు' అని జగన్ పాత్రధారితో డైలాగ్ చెప్పించడం ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే 'యాత్ర' మూవీలో వైఎస్సార్ పాత్రలో జీవించిన సీనియర్ నటుడు మమ్ముట్టి 'యాత్ర 2'లోనూ మమ్ముట్టి మరోసారి తనదైన నటన, డైలాగ్ డెలివరీతో మెస్మరైజ్ చేశారు. ఇక తమిళ హీరో జీవా జగన్ పాత్రలో అద్భుతంగా నటించారు. తెరపై జీవాను చూసినంతసేపు జగన్‌ను చూసినట్లే ఉంటుంది. అంతలా ఆ పాత్రలో లీనమైపోయారు.
వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్, విజయమ్మగా ఆశ్రిత వేముగంటి, చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్‌లు, శుభలేఖ సుధాకర్, కిషోర్ కుమార్ పొలిమేర, తదితరులు అద్భుతంగా నటించారు. బ్లైండ్ పాత్రలో తమిళ నటుడు జార్జ్ మరియమ్ కనిపించేది రెండు మూడు సీన్లు అయినా సరే ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. మొత్తంగా చూసుకుంటే తండ్రి మరణం నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వరకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణాన్ని చూపించిన విధానం ప్రేక్షకులు కట్టిపడేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments