Yatra 2:తెలుగు రాష్ట్రాల్లో 'యాత్ర-2' ప్రభంజనం.. దద్దరిల్లుతోన్న థియేటర్లు..

  • IndiaGlitz, [Thursday,February 08 2024]

ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన 'యాత్ర-2' మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. థియేటర్ల వద్ద వైఎస్సార్ అభిమానుల కోలాహలం అంబరాన్నింటింది. జై జగన్.. జోహార్ వైఎస్సార్ నినాదాలో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. తండ్రి మరణం నుంచి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసే వరకు జరిగిన ఘటనలు, సంఘటనలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్‌సీపీ పార్టీని స్థాపించడం.. ఆ తర్వాత ఉప ఎన్నికలు.. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? చంద్రబాబు పాత్ర నుంచి జగన్ పార్టీకి ఎటువంటి పోటీ ఎదురైంది? అనే అంశాలపై ఈ సినిమా తెరకెక్కించారు.

మూవీలో 'నాయకులకు తెలిసినంత రాజకీయం కార్యకర్తలకు తెలియదు కదా సార్'.. 'జగన్ రెడ్డి కడపోడు సార్' అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గొప్పతనం ఈతరం వాళ్లకు తెలిసేలా చాలా ఎమోషనల్‌గా సినిమాను తెరకెక్కించారు. అప్పటి రాజకీయ పరిస్థితులు కళ్లకు కట్టారు. దేవుడు అంటే నమ్మకం.. వైఎస్సార్ అంటే నిజం.. ఇలాంటి డైలాగ్స్ వైఎస్సార్ వ్యక్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాయి. ఆయన మరణానంతరం జగన్‌ను ఎలా హింసించారు.. విలన్‌గా చూపడానికి ఎలాంటి ఎత్తులతు వేశారని ఇందులో చూపించారు. ఆ కుట్రలను జగన్ ఎలా ఎదుర్కొన్నాడనేది రసవత్తరంగా మలిచారు.

అలాగే చంద్రబాబు నిజస్వరూపం ఎలాంటిది అనేది ఈ చిత్రంలో స్పష్టంగా చూపించారు. అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు ఎవరిని తక్కువ చేసి చూపించలేదు. 'మనం తలపడుతున్నది చంద్రబాబుతో, తక్కువ అంచనా వేయకూడదు' అని జగన్ పాత్రధారితో డైలాగ్ చెప్పించడం ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే 'యాత్ర' మూవీలో వైఎస్సార్ పాత్రలో జీవించిన సీనియర్ నటుడు మమ్ముట్టి 'యాత్ర 2'లోనూ మమ్ముట్టి మరోసారి తనదైన నటన, డైలాగ్ డెలివరీతో మెస్మరైజ్ చేశారు. ఇక తమిళ హీరో జీవా జగన్ పాత్రలో అద్భుతంగా నటించారు. తెరపై జీవాను చూసినంతసేపు జగన్‌ను చూసినట్లే ఉంటుంది. అంతలా ఆ పాత్రలో లీనమైపోయారు.

వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్, విజయమ్మగా ఆశ్రిత వేముగంటి, చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్‌లు, శుభలేఖ సుధాకర్, కిషోర్ కుమార్ పొలిమేర, తదితరులు అద్భుతంగా నటించారు. బ్లైండ్ పాత్రలో తమిళ నటుడు జార్జ్ మరియమ్ కనిపించేది రెండు మూడు సీన్లు అయినా సరే ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. మొత్తంగా చూసుకుంటే తండ్రి మరణం నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వరకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణాన్ని చూపించిన విధానం ప్రేక్షకులు కట్టిపడేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

More News

Kodikatthi Srinu :ఎట్టకేలకు కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు

2019 ఎన్నికలకు ముందు ఏపీలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది.

Governor:తమది ప్రజా ప్రభుత్వం.. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.

Chandrababu:అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ.. ఎన్డీఏలోకి ఆహ్వానం..

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరూ పొత్తులో కలుస్తారో అర్థం కాని పరిస్థితి.

Sharmila :తన చెడు కోరుకుంటున్నారా..? సీఎం జగన్‌ టార్గెట్‌గా షర్మిల విమర్శలు..

తన భద్రతపై సీఎం జగన్‌ టార్గె్‌ట్‌గా మరోసారి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

Lal Salaam:ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే.. రజినీకాంత్ డైలాగ్ అదిరింది..

మొయిద్దీన్ భాయ్ పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'లాల్ సలామ్'(LAL SALAAM) తెలుగు ట్రైలర్‌ మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.