ఇంట్లోనే కరోనా చికిత్స అందించేందుకు ముందుకొచ్చిన ‘యశోదా’
- IndiaGlitz, [Tuesday,June 23 2020]
కరోనా పాజిటివ్ అనగానే మనకు గుర్తొచ్చేది గాంధీ హాస్పిటల్. కానీ అక్కడ బెడ్స్ కొరతతో పాటు అంత మందికి చికిత్స అందించేందుకు సరిపడా వైద్య సిబ్బంది కూడా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగిలిన గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి.. వారి ఇంట్లోనే వైద్య సహాయం అందిస్తామని యశోదా హాస్పిటల్ ముందుకొచ్చింది.
15 రోజుల పాటు వీరందించే ట్రీట్‌మెంట్ కోసం రూ.19500 వసూలు చేయనున్నారు. ఒకవేళ తాము అందించిన ట్రీట్‌మెంట్ నుంచి కోలుకోక పేషెంట్ ఆరోగ్య పరిస్థితి దిగజారితే వెంటనే తమ హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందిస్తామని కూడా యశోద పేర్కొంది. తాము అందించబోయే ట్రీట్‌మెంట్ వివరాలకు సంబంధించిన ప్రకటనను యశోదా యాజమాన్యం విడుదల చేసింది. చికిత్స అవసరమని భావించేవారు తమను 7207572075 అనే నంబర్ ద్వారా సంప్రదించాలని యశోదా యాజమాన్యం కోరింది.