బ్రతికున్నందుకు జీవితాంతం బాధపడతా: యషిక ఆనంద్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ తమిళ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ యషిక ఆనంద్ గత వారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సినిమాలు, బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన యషిక.. సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ క్రేజ్ పెంచుకున్నారు. యషిక గత వారం తన ఫ్రెండ్ తో కలసి పాండిచ్చేరికి పార్టీ కోసం వెళ్ళింది.
ఇదీ చదవండి: పవన్ - రానా మూవీ రిలీజ్ డేట్ ఇదే.. అతి త్వరలో ఫస్ట్ సింగిల్
తిరుగు ప్రయాణంలో చెన్నైకి వస్తుండగా.. మామల్లాపురం సమీపంలో యషిక ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో యషిక తీవ్రగాయాలకు గురైంది. ఆమె స్నేహితురాలు పావని అక్కడికక్కడే మృతి చెందింది. చెన్నైలో చికిత్స పొందుతున్న యషిక ఆనంద్ ప్రస్తుతం కోలుకుంటోంది.
ఈ విషాదకర సంఘటన గురించి యషిక కన్నీటి పర్యంతమవుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. తీవ్ర వేదనతో తన స్నేహితురాలు పావనిని గుర్తు చేసుకుంది. 'నా మనసులో ఎలాంటి వేదన ఉందో వర్ణించలేను. నేను బ్రతికున్నందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటా. ఈ ఘోర ప్రమాదం నుంచి నన్ను రక్షించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలో.. నా బెస్ట్ ఫ్రెండ్ పావనిని దూరం చేసినందుకు నిందించాలి తెలియడం లేదు.
ప్రతి క్షణం నిన్ను మిస్సవుతున్నా పావని. నువ్వు నన్ను క్షమించవని తెలుసు. నీ కుటుంబానికి ఇంతటి ఘోరమైన పరిస్థితి కల్పించినందుకు నన్ను క్షమించు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి పావని' అని యషిక పోస్ట్ పెట్టింది.
ఇలాంటి పరిస్థితుల్లో తాను తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోవడం లేదని యషిక తెలిపింది. తన అభిమానులు కూడా తన బర్త్ డే సెలెబ్రేట్ చేయవద్దని కోరింది. పావని కుటుంబం కోసం అంతా ప్రార్థించాలని కోరింది. తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన యషిక..విజయ్ దేవరకొండ నోటా చిత్రంలో మెరిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com