ప్రభాస్‌కు యశ్ రెకమండేషన్
Send us your feedback to audioarticles@vaarta.com
`బాహుబలి`తో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్‌కు కన్నడ స్టార్ హీరో యశ్ రెకమండేషన్ చేశాడు. ఇంతకు ఏ విషయంలోనని అనుకుంటున్నారా? వివరాల్లోకెళ్తే.. `కె.జి.యఫ్`తో సూపర్‌స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్న హీరో యశ్‌ను ఓ పెద్ద డైరెక్టర్ కలిసి ఓ కథ చెప్పాడట. అయితే తన కంటే ఆ కథ ప్రభాస్‌కు అయితే సూట్ అవుతుందని భావించిన యశ్.. ఆ డైరెక్టర్‌కి ప్రభాస్ పేరును సూచించాడట.
అంతే కాకుండా ప్రభాస్‌కు ఫోన్ చేసి ఆ డైరెక్టర్ కథ వినమని కూడా చెప్పాడని వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం యశ్ `కె.జి.యఫ్ 2` చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడే `సాహో`ను పూర్తి చేసిన ప్రభాస్ తదుపరి `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments