బ్యూటిఫుల్ పిక్స్: యష్, రాధికా దంపతుల కొత్త ఇంటి గృహ ప్రవేశం !
Send us your feedback to audioarticles@vaarta.com
కెజిఎఫ్ సక్సెస్ తో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. తాజాగా యష్, రాధికా పండిట్ దంపతులు జీవితంలో సంతోషకరమైన కొత్త అడుగు వేశారు. బెంగుళూరులో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్మెంట్స్ లో యష్ ఇటీవల ఇంటిని కొనుగోలు చేశాడు. కాగా తాజాగా ఈ దంపతులు ఇద్దరూ కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేశారు.
సాంప్రదాయబద్దంగా పూజా కార్యక్రమాలతో స్వీట్ అండ్ సింపుల్ గా గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ గృహ ప్రవేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
యష్, రాధికా దంపతులు తమ అభిరుచి అనుగుణంగా కొత్త ఇంట్లో చక్కటి ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. యష్, రాధిక గృహ ప్రవేశ కార్యక్రమ ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతున్నారు.
సినిమాల విషయానికి వస్తే కేజిఎఫ్ చాప్టర్ 2 కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. రాఖీ భాయ్ గా యష్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ని అభిమానులు మరోసారి చూడాలనుకొంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా వల్ల సరైన విడుదల టైం కోసం ఎదురుచూస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments