బరిలోకి దిగుతున్న యష్
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కేజీయఫ్ చాప్టర్ 2’. దీనికి ముందుభాగం ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ పాన్ ఇండియా మూవీగా విడుదలై బ్లాక్‌బస్టర్ అయ్యింది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ పార్ట్ పూర్తి కావాల్సి ఉంది. కోవిడ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రీస్టార్ట్ అయ్యింది. గురువారం నుండి యూనిట్‌తో యష్ కూడా జాయిన్ అవుతున్నారట. ఈ విషయాన్ని నిర్మాత కార్తీక్ గౌడ తెలియజేశారు. ఈ నెలాఖరుకంతా షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని ఆయన తెలిపారు.
సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్ దత్ ఇందులో మెయిన్ విలన్ అధీరా పాత్రలో నటిస్తుండగా, మరో కీలక పాత్రలో రవీనాటాండన్ నటిస్తున్నారు. రాకీ భాయ్‌గా యష్ రాకింగ్ పెర్ఫామెన్స్‌తో ‘కేజీయఫ్ ఛాప్టర్ 1’.. రూ.200కోట్ల మేరకు సినిమా వసూళ్లను సాధించింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. కె.జి.యఫ్ పార్ట్ 1 సాధించిన సక్సెస్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నిర్మాతలు ఈ అంచనాలకు ధీటుగా సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకరెక్కిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments