బ‌రిలోకి దిగుతున్న య‌ష్‌

  • IndiaGlitz, [Wednesday,October 07 2020]

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కేజీయఫ్ చాప్టర్ 2’. దీనికి ముందుభాగం ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ పాన్ ఇండియా మూవీగా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ పార్ట్ పూర్తి కావాల్సి ఉంది. కోవిడ్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే రీస్టార్ట్ అయ్యింది. గురువారం నుండి యూనిట్‌తో య‌ష్ కూడా జాయిన్ అవుతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని నిర్మాత కార్తీక్ గౌడ తెలియ‌జేశారు. ఈ నెలాఖ‌రుకంతా షూటింగ్ పూర్త‌వుతుంది. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సంజ‌య్ ద‌త్ ఇందులో మెయిన్ విల‌న్ అధీరా పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో ర‌వీనాటాండ‌న్ న‌టిస్తున్నారు. రాకీ భాయ్‌గా య‌ష్ రాకింగ్ పెర్ఫామెన్స్‌తో ‘కేజీయఫ్ ఛాప్టర్ 1’.. రూ.200కోట్ల మేరకు సినిమా వ‌సూళ్ల‌ను సాధించింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. కె.జి.య‌ఫ్ పార్ట్ 1 సాధించిన స‌క్సెస్‌తో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. నిర్మాత‌లు ఈ అంచ‌నాల‌కు ధీటుగా సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌క‌రెక్కిస్తున్నారు.

More News

శాంతించిన ఓపీఎస్.. ఈపీఎస్‌కు లైన్ క్లియర్..

గత కొద్ది రోజులుగా హాట్ హాట్‌గా నడుస్తున్న తమిళ రాజకీయాల్లో ఎట్టకేలకు ప్రశాంతత నెలకొంది. సీఎం అభ్యర్థి నిర్ణయంపై అన్నాడీఎంకేలో చెలరేగిన వివాదం  సీనియర్‌ మంత్రులు,

నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు: పార్థసారధి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను నవంబర్ లేదంటే డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు.

క్రేజీ కాంబినేష‌న్‌...!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. తదుప‌రి సినిమా ఏంట‌నే దానిపై క్లారిటీ లేదు. అనుష్క ప‌లానా చిత్రంలో న‌టిస్తుందంటూ సోష‌ల్ మీడియాలో

అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును ప్రకటించిన పన్నీర్ సెల్వం

అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును అధికారికంగా ప్రకటించారు. నిన్న మొన్నటి వరకూ ఉన్న విభేదాలన్నింటినీ పక్కనపెట్టి పళని స్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వమే

‘రంగ్ దే’ షెడ్యూల్ పూర్తి చేసిన నితిన్ అండ్ టీమ్‌

నితిన్, కీర్తిసురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ సినిమా ఫైన‌ల్ ద‌శ షూటింగ్‌కు చేరుకుంది.