య‌శ్ క్రేజే వేర‌ప్పా..!

  • IndiaGlitz, [Wednesday,January 08 2020]

క‌న్న‌డ సినిమా రంగం నుండి ఉపేంద్ర త‌ర్వాత ఇత‌ర సినిమాల మార్కెట్‌లో త‌న‌కంటూ ఇమేజ్ సంపాదించుకున్న న‌టుడు రాక్‌స్టార్ య‌శ్‌. ఓ ర‌కంగా చెప్పాలంటే ఉపేంద్ర‌కు బాలీవుడ్‌లో క్రేజ్ లేదు కానీ.. య‌శ్‌కు బాలీవుడ్‌లోనూ విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. య‌శ్‌కు సినిమా సినిమాకు క్రేజ్ పెరుగుతుంది. ఈరోజు య‌శ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పెద్ద కేక్‌ను క‌ట్ చేస్తున్నారు. పెద్ద కేక్ అంటే ప‌ది కిలోలో, వంద కిలోలు 5000 కిలోల కేక్‌ను క‌ట్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు... ప్ర‌పంచంలోనే ఏ హీరో పుట్టిన‌రోజుకు ఇంత పెద్ద కేక్‌ను క‌ట్ చేయ‌లేదు. ఇదొక రికార్డ్ అని అంటున్నాయి సినీ వ‌ర్గాలు. బెంగ‌ళూరులోని ప్ర‌ముఖ ఆడిటోరియంలో ఈ కేక్ క‌టింగ్ జ‌రిగింది.

కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 1 సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డంతో అంద‌రి దృష్టి ఇప్పుడు చాప్ట‌ర్ 2పై ఉంది. ర‌వీనాటాండ‌న్, సంజ‌య్ ద‌త్ లాంటి స్టార్స్ కూడా ఈ సెకండ్ చాప్ట‌ర్‌లో వ‌ర్క్ చేస్తున్నారు. ఈ అంచ‌నాల‌ను మించేలా..నేడు య‌శ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌లో సెకండ్ లుక్‌ను విడుద‌ల చేసింది. ఈ ఇన్‌టెన్స్ లుక్ అంచ‌నాల‌ను రెట్టింపు చేస్తుంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న 'కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2' ..2020 ద్వితీయార్థంలో విడుద‌ల‌వుతుంది.