వల్లభనేని వంశీకి స్ట్రాంగ్ కౌంటరిచ్చిన యార్లగడ్డ

  • IndiaGlitz, [Monday,May 06 2019]

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. సన్మానం చేస్తానంటూ వంశీ.. యార్లగడ్డకు ఇంటికెళ్లడం.. తనను బెదిరిస్తున్నాడని యార్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అంతటితో ఆగని ఈ వివాదం.. తాజాగా వంశీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం, బహిరంగ లేఖ మరోసారి వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో వెంకట్రావు మీడియా ముందుకొచ్చారు. వచ్చీరాగానే వంశీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

దొంగలెవరో అందరికీ తెలుసు..!?

సోమవారం వల్లభనేని వంశీ చేసిన ఆరోపణలు, బహిరంగ లేఖపై స్పందించడానికి విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వంశీకి ఓటమేనని.. ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే వంశీ ఆరోపణలు చేస్తున్నారని వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు.. మంచి చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ప్రజలకు సమస్యలు సృష్టించే రీతిలో ఈ ఐదేళ్ల పాలన సాగిందని మండిపడ్డారు. టీడీపీ పాలనలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. మేం మట్టి దొంగలం కాదని.. అజ్జనపూడిలో యాదవ, కైస్త్రవ భూములను దొంగిలించింది మేం కాదని.. అది ఎవరో ప్రజలందరికి తెలుసునన్నారు.

భయంతోనే ఇలా చేస్తున్నారు..!!

స్థానిక ఎమ్మెల్యే దురాగతాలను ప్రజలందరూ చెబుతున్నారు. వారు ఇచ్చిందే నేను మాట్లాడాను స్థానిక ఎమ్మెల్యేపై వ్యక్తిగత దూషణాలకు దిగలేదు. ప్రజలు చెప్పితే మాట్లాడను. బండారుగూడెం ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి షిర్యాదు చేశారని.. ఇద్దరు వ్యక్తులు తగాద పడితే పంచాయితీ చేసి ఖాళీ స్టాంపులపై సంతకాలు పెట్టించుకున్నారు. ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించిన డబ్బుతోనే రాజకీయాల్లోకి వచ్చాను. ఎమ్మార్వోలను మండల రెవెన్యూ ఆఫీసర్లుగా పనిచేయించకుండా.. మట్టి రెవెన్యూ ఆఫీసర్లుగా మార్చేసి చెరువులను తవ్వుకున్నారు. గన్నవరం నియోజకవర్గం శాంతికి నిలయం.. ఓటమి భయంతోనే సంస్కారహీనులుగా వంశీ మాట్లాడుతున్నారు. 13 జిల్లాల ప్రజలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్‌ అధికారంలోకి వస్తున్నారని, టీడీపీ నేతల అవినీతిపై విచారణ జరిపిస్తారనే భయం ఓవైపు.. మరోవైపు.. గన్నవరం నియోజకవర్గం చేజారిపోయిందనే దు:ఖంతో వంశీ మాట్లాడుతున్నారు అని వెంకట్రావ్ చెప్పుకొచ్చారు. యార్లగడ్డ వ్యాఖ్యలపై వంశీ ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

బాల‌కృష్ణ 105వ సినిమా వివరాలు

బాల‌కృష్ణ 105వ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డింది. శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు న‌ట‌సింహ నందమూరి బాల‌కృష్ణ

డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ బుర్ర‌క‌థ‌

ఆది సాయికుమార్, మిస్తి చ‌క్ర‌వ‌ర్తి జంట‌గా న‌టిస్తున్న చిత్రం బుర్ర‌క‌థ‌. పిల్లా  నువ్వులేని జీవితం, ఈడో ర‌కం, ఆడో ర‌కం సినిమాల‌తో ర‌చ‌యిత‌గా పెద్ద విజ‌యాల్ని అందుకున్న డైమండ్ ర‌త్న‌బాబు

నటి సురేఖ వాణి భర్త కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. నటి సురేఖ వాణి భర్త, టీవీషోల దర్శకుడు సురేశ్ తేజ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేశ్ సోమవారం కన్నుమూశారు.

'ఏదైనా జరగొచ్చు' ఆడియో విడుదల 

ప్రముఖ నటుడు శివాజీరాజా కొడుకు విజయ్‌రాజాను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ కె.రమాకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. బాబీసింహా విల‌న్ గా న‌టిస్తున్నారు.

మే 24న 'నేను లేను' విడుదల

ఓ.య‌స్‌.యం విజన్ - దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నేను లేను'. 'లాస్ట్ ఇన్ లవ్' అనేది ఉప‌శీర్షిక‌.