టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన యాప్రాల్ ప్రజలు..
- IndiaGlitz, [Monday,November 23 2020]
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రజాప్రతినిధులను కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే యాప్రాల్ ప్రజలు ఓట్లు అడిగేందుకు వచ్చిన మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు చుక్కలు చూపించారు. అంతే కాదు.. సొంత నిధులతో రోడ్లు వేయిస్తానని ఆయన లెటర్ ప్యాడ్‌పైనే రాయించి సంతకం పెట్టించారు. అక్కడితో ఆగక ఆయన తలపైనే చేయి వేయంచి ప్రమాణం చేయించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఓట్లు అడిగేందుకు యాప్రాల్ వెళ్లారు. స్థానిక ప్రజలు ‘నో రోడ్స్.. నో ఓట్స్’, ‘రోడ్డు వేయండి.. ఓటు అడగండి’ అనే ప్లకార్డులతో దాదాపు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే మైనంపల్లికి చుక్కలు చూపించారు. దీంతో ఎన్నికలు అయిపోగానే సొంత నిధులతో రోడ్లు వేయిస్తానని తన లెటర్ ప్యాడ్‌పై రాసి సంతకం చేసి మరీ ఎమ్మెల్యే మైనంపల్లి వారికి హామీ ఇచ్చారు.
కానీ ప్రజలు అంతటితో శాంతించలేదు.. దీంతో ఆయన తనపైనే ఒట్టు వేసుకుని మరీ రోడ్లు వేయిస్తానని ప్రమాణం చేశారు. దీంతో ఓటర్లు కాస్త కూల్ అయ్యారు. కాగా.. సొంత నిధులతో తమకు రోడ్లు వేయించాల్సిన అవసరమేమీ లేదని.. జీహెచ్ఎంసీకి తాము ట్యాక్స్‌లు కడుతున్నామని, ప్రజాధనంతోనే తమకు రోడ్లు వేయాలని మైనంపల్లికి యాప్రాల్ ప్రజానీకం తెలిపింది. దీంతో తనపై నమ్మకముంచి తనను గెలిపించిన ప్రజలకు తప్పకుండా న్యాయం చేస్తానని మైనంపల్లి హనుమంత రావు హామీ ఇచ్చారు.