చరణ్‌ను కామెంట్ చేసిన యండమూరి...
- IndiaGlitz, [Wednesday,January 20 2016]
స్టార్ రచయితగా పేరున్న యండమూరి వీరేంద్రనాథ్‌కు చిరంజీవితో మంచి రిలేషన్స్ ఉండేవి. గతంలో చిరంజీవి సక్సెస్ సాధించిన అభిలాష, మరణ మృదంగం చిత్రాలకు యండమూరి వీరేంద్రనాథ్ కథను అందించాడు. సరే పాత సంగతులను పక్కన పెడితే రీసెంట్‌గా ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఫంక్షన్‌కు హాజరైన యండమూరి వీరేంద్రనాథ్ మెగాస్టార్ తనయుడు రాంచరణ్‌పై వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశాడు.
చరణ్‌ను హీరో చేయడానికి సురేఖ చాలా కష్టపడిందని అయిదే దవడ ఎముక సరిగా లేకపోవడంతో అపరేషన్ చేయించారని కూడా అన్నాడు. అదే వేదికపై దేవిశ్రీని పొగిడిన యండమూరి ఎవరైనా తమకు తాముగా ఎదగాలని, తండ్రులు పేరు చెప్పుకోకూడదని కూడా అన్నారు. ఈ కామెంట్సతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. మరిప్పుడు యండమూరి ఏమని బదులిస్తాడో చూడాలి.