'యముడికి మొగుడు'కి 30 ఏళ్ళు
Send us your feedback to audioarticles@vaarta.com
ధర్మాన్ని పాటించే యమధర్మరాజు తప్పు చేస్తే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమే 'యముడికి మొగుడు'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, రాధ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా నటించారు. 'పసివాడి ప్రాణం' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత.. మళ్ళీ చిరు కెరీర్‌లో అటువంటి హిట్‌ని అందించిన మూవీ ఇది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్‌లో చిరు ద్విపాత్రాభినయం చేశారు. విచిత్రగుప్త పాత్ర ద్వారా యమలోకంలో కొత్త పాత్రను ప్రేక్షకులకి పరిచయం చేసిన ఘనత దర్శకుడిదే.
అలాగే.. మనిషిని పోలిన మనుషులు ఆరుగురుంటారనే నానుడిని యమధర్మరాజు చేసిన తప్పుకి రెమిడీగా బాగా వాడుకున్నారు. ఇక ఆకాశమే హద్దు అన్నట్టుగా చిరు.. తన నటన, డాన్స్, ఫైట్స్, కామెడీలతో చేసిన సందడి అంతా ఇంతా కాదు. మొత్తమ్మీద.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు.
అలాగే రాధ, విజయశాంతి గ్లామర్‌కే పరిమితం కాకుండా.. నటనకు అవకాశమున్న పాత్రల్లో మెప్పించారు. ఒక కమర్షియల్ మూవీకి ఎటువంటి సంగీతం కావాలో అటువంటి సంగీతాన్ని పాటల రూపంలో అందించి సినిమాకి నూటికి నూరు శాతం న్యాయం చేశారు మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్ కోటి. డైనమిక్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 29, 1988న రిలీజై.. నేటితో 30 సంవత్సరాలను పూర్తి చేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout