విలేఖరికి షాకిచ్చిన యమీ గౌతమ్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నితిన్ హీరోగా నటించిన చిత్రాల్లో గౌతమ్ మీనన్ `కొరియర్‌బాయ్ కల్యాణ్` చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ ఈ చిత్రంలో నితిన్ జోడిగా నటించింది. అయితే ఈమెకు దక్షిణాది కంటే ఉత్తరాది సినిమాల్లోనే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. విజయాలు కూడా దక్కడంతో ఈమెకు హిందీలో ఓ గుర్తింపు దక్కింది. రీసెంట్గా ఈమె నటించిన బాలీవుడ్ చిత్రం `బాలా`. ఈ సినిమా గురించి యామీ గౌతమ్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతున్న సమయంలో విలేఖరి మీరు బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నించారు. దానికి ఆమె `ఎందుకు చేసుకోకూడదు?` అంటూ ఇచ్చిన బదులు అందరికీ నచ్చింది.
``సాధారణంగా బట్టతల ఉన్న వ్యక్తులు కూల్‌గా ఉంటారు. అసలు `బాలా` సినిమాను తెరకెక్కించడానికి కారణం ఓ మెసేజ్ ఇవ్వడానికే. డైరెక్టర్ కౌశిక్ ఓ మంచి సినిమాను తెరకెక్కిస్తున్నారని మేం నమ్మాం. బట్టతల ఉన్న వ్యక్తులు ముందు తమని తాము ప్రేమించుకోవాలి. తర్వాతే ఇతరుల నుండి ప్రేమ దక్కుతుందని ఆశించాలి. ప్రస్తుతం సినిమాపై మేం పెట్టుకున్న నమ్మకం నిజమైంది. సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది. ఈ చిత్రంలో నటించడం మంచి ఎక్స్‌పీరియెన్స్, డిఫరెంట్ పాత్రలో నటించాను`` అన్నారు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన `బాలా` చిత్రం రీసెంట్గా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లో 52.20 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాల అంచనా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments