అప్పుడే ఆయన ప్రేమలో పడ్డా, కొంతమందికి తెలుసు: హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామి గౌతమ్ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో పెద్దగా సక్సెస్ కానప్పటికీ యామి గౌతమ్ కి క్రేజ్ ఉంది. నార్త్ లో కూడా యామి గుర్తింపు పొందింది. ఇటీవల యామి గౌతమ్ సడన్ గా 'ఉరి' చిత్ర దర్శకుడు ఆదిత్య ధార్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. యామి గౌతమ్ సడెన్ సర్ ప్రైజ్ కు అంతా షాకయ్యారు.
ఇదీ చదవండి: పక్కా.. అవి పోర్న్ వీడియోలే.. కాదు చెక్ చేసుకోండి అంటున్న హాట్ బ్యూటీ
ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంలో యామి గౌతమ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. యామి గౌతమ్, ఆదిత్య ధార్ ఎఫైర్ గురించి గతంలో రూమర్స్ వచ్చినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా యామి గౌతమ్ ప్రేమ, పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.
ఉరి చిత్ర ప్రమోషన్స్ సమయంలో తామిద్దరం ప్రేమలో పడ్డట్లు యామి తెలిపింది. ఆయన ప్రేమలో పడక ముందే ఆదిత్య ధార్ మంచి వ్యక్తి అని తెలుసు. దర్శకుడిగా ఎంత ఒత్తిడిలో ఉన్నా ఇతరులకు గౌరవం ఇచ్చేవారు. ఉరి చిత్రంతోనే ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం స్నేహంగా బలపడింది. ప్రమోషన్స్ టైంలో ప్రేమలో పడిపోయా.
మేమిద్దరం ప్రేమించుకుంటున్నట్లు ఇండస్ట్రీలో కొంతమంది స్నేహితులకు తెలుసు. వారు ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడకుండా ప్రైవసీ ఇచ్చారు అని యామి తెలిపింది. ఇక పెళ్లి సింపుల్ గా జరిగిపోవడానికి కారణం చెప్పింది. సహజంగానే మా ఇద్దరికీ హంగులు, ఆర్భాటాలతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇక లాక్ డౌన్ ఎలాగు ఉంది. కాబట్టి కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా వివాహం చేసుకున్నట్లు యామి గౌతమ్ వివరించింది. యామి గౌతమ్ తెలుగులో నువ్విలా, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి చిత్రాల్లో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com